Personality Test: ఇదే మీ వ్యక్తిత్వం.. నిద్రించే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలానో తెలుసా
మీరు పడుకునే పోజిషన్స్ బట్టి మీరు ఎలాంటి వారు, మీ వ్యక్తిత్వం ఎలాంటి అనే విషయాలను తెలుసుకోవచ్చని మీకు తెలుసా? అవును, వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం.. మనం నిద్రించే భంగిమ మనం ఎలాంటి వాళ్లకు, మన స్వభావం, మన వ్యక్తిత్వం గురించి చెబుతుందట. దాన్ని చాలా మంది నమ్ముతారు కూడా. కాబట్టి, మీరు ఎలాంటి పోజిషన్స్‌లో పడుకుంటున్నారో చూసి.. దాని ఆధారం మీరు ఎలాంటి వారో ఇక్కడ తెలుసుకోండి.
Updated on: Aug 24, 2025 | 7:00 PM

వెల్లకిలా పడుకునే వారు: ఇలా వెల్లకిలా పడుకునే వ్యక్తులు ఆశావాదులు. వీరు త్వరగా నిద్రలేస్తారు. రోజంతా యాక్టీవ్‌గా ఉంటారు. వారిపై వారికి చాలా నమ్మకం ఉంటుంది. అంతేకాకుండా వీరు తమ లక్ష్యాలను సాధించడానికి చాలా శ్రద్ధగా, పట్టుదలతో పనిచేస్తారు. వారు తమ జీవితాలను నిర్మాణాత్మకంగా గడుపుతారు. వీరు విశాల దృక్పథం కలిగి ఉంటారు. వీరు స్నేహ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యను ఇస్తారు. వాటితో పాటు ఇతరుల మాటలను జాగ్రత్తగా వింటారు. వారికి ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు.

ఒకవైపు పడుకునే వ్యక్తులు: ఎడమ లేదా కుడివైపు, ఒకవైపు పడుకునే వ్యక్తులు ప్రశాంతంగా ఉంటారు. వీరు నమ్మదగినవారు. వీరు అన్ని విషయాల్లో యాక్టీవ్‌గా ఉంటారు. అంతేకాకుండా.. వారు గతం గురించి బాధపడకుండా.. ఎల్లప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరు తమ లైఫ్‌లో ఎదురైయ్యే పరిస్థితులను అనుగునంగా తమలో మారుతూ ఉంటారు. కష్ట సమయాల్లో కూడా వీరు చిరునవ్వు ముఖంతో కనిపిస్తారు.

ముఖ్యంగా రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోని వ్యక్తులు క్యాన్సర్, స్ట్రోక్, గుండె జబ్బులు, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. తగినంత నిద్ర లేకపోవడం మెదడును తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది వివిధ వ్యాధులకు దారితీస్తుంది.

కడుపుపై నిద్రపోవడం: కడుపు మీద పడుకునే వారు ఎప్పుడూ ఉల్లాసంగా, ప్రశాంతంగా ఉంటారు. వీరు విశాల దృక్పథం కలిగి ఉంటారు. అలానే ఎక్కువగా సామాజికంగా ఉండటానికి ఇష్టపడతారు. అంతేకాకుండా వీరు ఎక్కువగా ఇండిపెండెంట్‌గా ఉండాలనుకుంటారు. జీవితంలో ఎలాంటి సవాళ్ల వచ్చినా ఎదుర్కోవడానికి భయపడరు.

ఒక పక్కకు తిరిగి చేయి చాచి పడుకునే వారు: ఇలా పడుకునే వారు ఇతరులతో చాలా ఓపెన్‌గా ఉంటారు. అంతేకాకుండా ఇతరులను తొందరగా నమ్మరు. వేరేవాళ్లను నమ్మడానికి చాలా టైమ్ తీసుకుంటారు. వాళ్లను పూర్తిగా నమ్మిన తర్వాత వారిపై ఒక నిర్ణయానికి వస్తారు.




