- Telugu News Photo Gallery NMDC Hyderabad Marathon 2025: Empowering Visually Impaired Kids Through Running
NMDC Hyderabad Marathon 2025: దృష్టి లోపం ఉన్న పిల్లల్లో మనోస్థైర్యం నింపడమే లక్ష్యం.. అట్టహాసంగా ఎన్ఎండీసీ మారథాన్..
ఎన్ఎండీసీ (NMDC) హైదరాబాద్ మారథాన్ రన్ 2025 వేడుకగా జరిగింది.. ఈ మారథాన్ లో రోహిణి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. దృష్టి లోపం ఉన్న పిల్లలు 1 కి.మీ పరుగులో పాల్గొనడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందరితోపాటు.. దివ్యాంగులైన పిల్లలు కూడా క్రీడలలో పాల్గొనే హక్కు ఉందని ఈ చొరవ ప్రత్యేకంగా చూపిస్తుంది.
Updated on: Aug 24, 2025 | 6:59 PM

ఎన్ఎండీసీ (NMDC) హైదరాబాద్ మారథాన్ రన్ 2025 వేడుకగా జరిగింది.. ఈ మారథాన్ లో రోహిణి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. దృష్టి లోపం ఉన్న పిల్లలు 1 కి.మీ పరుగులో పాల్గొనడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందరితోపాటు.. దివ్యాంగులైన పిల్లలు కూడా క్రీడలలో పాల్గొనే హక్కు ఉందని ఈ చొరవ ప్రత్యేకంగా చూపిస్తుంది. అంతేకాకుండా వారిలో మానసికోల్లాసానికి దోహదపడుతుంది.

ఎన్ఎండీసీ హైదరాబాద్ మారాథాన్‌లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు.. వచ్చే ఏడాది కూడా మళ్ళీ చేరడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు.. ఇలాంటి కార్యక్రమాలతో తమలో మనోస్థైర్యం నింపుతుందని పేర్కొన్నారు. పుట్టుకతో వైకల్యం ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లల్లో మనోస్థైర్యం నింపేందుకు.. మానసికంగా బలంగా మార్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయి..

రోహిణి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంపత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ లాభాపేక్షలేని కార్యక్రమానికి మద్దతు ఇచ్చినందుకు హైదరాబాద్ రన్నర్స్ గ్రూప్, ఆర్సీసియం, SVP-హైదరాబాద్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతి సంవత్సరం ఆగస్టులో ఎన్ఎండీసీ (NMDC) హైదరాబాద్ మారథాన్ రన్ ను నిర్వహిస్తారు. ఇది దివ్యాంగులైన పిల్లల్లో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుంది.

శనివారం జరిగిన ఈ మారథాన్ రన్ లో రోహిణి ఫౌండేషన్ సభ్యులతోపాటు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని.. దివ్యాంగుల్లో మనోస్థైర్యం నింపడమే తమ లక్ష్యమని ఎన్ఎండీసీ మారాథాన్ నిర్వాహకులు తెలిపారు.




