Bay Leaves: బిర్యానీ ఆకులని ఇలా వాడితే బోలెడన్నీ లాభాలు.. ముసలితనం పరార్..!
ఆహార రుచిని పెంచడానికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తారు. వీటిలో ఒకటి బిర్యానీ ఆకు. ఇది ప్రతి ఇంటి వంటగదిలో తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఆకు కూరగాయల రుచిని పెంచడమే కాకుండా, దీనికి అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దాని రుచి, వాసన కారణంగా బిర్యానీ ఆకును సాధారణంగా వంటగదిలో ఆహార రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. కానీ, ఈ ఆకు ఒక ఔషధం కంటే తక్కువ కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. బిర్యానీ ఆకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. గ్యాస్, అజీర్ణం, కడుపులో ఆమ్లత్వం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా, బిర్యానీ ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడం ద్వారా కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




