- Telugu News Photo Gallery Viral photos Russian couple suspected of killing and eating up to 30 victims
Shocking: నరమాంస భక్షకులు.. ఈ జంట 30 మందిని చంపి తిన్నారు.. దిమ్మతిరిగే నిజాలు
రష్యాలోని క్రాస్నొదర నగరంలో ఒక నరభక్ష జంటను పోలీసులు 2017లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిశాయి.
Updated on: Sep 29, 2021 | 11:42 AM

రష్యాలో 2017 ఇదే సెప్టెంబర్ నెలలో ఓ ఘోరం వెలుగుచూసింది. క్రాస్నొదర నగరంలో నివాసముంటున్న దిమిత్రీ బక్షీవ్(35), అతని భార్య నతాలియా(42) 20 సంవత్సరాలుగా దాదాపు 30 మందిని చంపి, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచుకొని తిన్నారు.

ఒక రోజు భవన నిర్మాణ కార్మికుడు రోడ్డుపై వెళ్తుండగా.. అతడికి ఒక సెల్ ఫోన్ కనపడింది. ఆ ఫోన్‌లో ఉన్న ఫోటోస్ చూడగానే.. అతడు షాకై పోలీసులకు సమాచారం అందించాడు. ఫోన్‌లో దిమిత్రీ బక్షీవ్ మానవ శరీర భాగాలను నోట్లో పెట్టుకొని తింటున్నట్టు కనిపించాడు.

పోలీసులు వీరు ఉంటున్న నివాసాన్ని తనికీ చేయగా.. దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి.. ఫ్రిడ్జ్‌లో దాచిన మనిషి మాంసం, ఇంట్లో మానవ ఎముకలు, మనిషి మాంసంతో వండిన వంటకాలు దొరికాయి. మానవ మాంసంతో వీరు వివిధ రకాల డిష్ లను తయారు చేసేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది.

డేటింగ్ యాప్‌ల ద్వారా ట్రాప్ చెయ్యడం. ఇంటికి పిలిపించి మత్తు మందు ఇచ్చి... స్పృహ కోల్పయాక వారిని చంపి, ముక్కలు, ముక్కలుగా నరికి, ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టుకుని తినేవారని తేలింది.

వీరిద్దరూ కలిసి 1999 నుంచి ఈ ఆటవిక చర్యను కొనసాగించారు. అప్పట్నుంచి దాదాపు 30 మంది బాధితులను వేటాడి, కిడ్నాప్ చేసి, చంపి.. తిన్నారు.





























