- Telugu News Photo Gallery Viral photos These are some mysterious places in world even scientists could not lift the curtain
Viral Photos: ప్రపంచంలోని 5 రహస్య ప్రదేశాలు..! వీటి మర్మం ఇప్పటికి తెలియలేదు.. ఎక్కడున్నాయంటే..?
Viral Photos: ప్రపంచంలో అనేక రహస్య ప్రదేశాలు ఉన్నాయి. వీటి మర్మం ఇప్పటికి అంతుపట్టదు. అయితే ఈ 5 రహస్య ప్రదేశాల గురించి ఎవ్వరికి తెలియదు.
Updated on: Sep 28, 2021 | 5:14 PM

స్టోన్‌హెంజ్, ఇంగ్లాండ్: ఇంగ్లాండ్‌లో ఉన్న ఈ ప్రదేశం చాలా రహస్య ప్రదేశం. ఇక్కడ ప్రత్యేకమైన బ్లూస్టోన్ మెటీరియల్‌తో తయారు చేసిన రాళ్లు గుండ్రంగా ఉండటం మనం గమనించవచ్చు. వీటిని క్రీస్తుపూర్వం 3000 నుంచి 2000 మధ్య నిర్మించారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం, గుజరాత్: సముద్రంలో ఉన్న ఈ ఆలయం రోజుకు రెండుసార్లు అదృశ్యమవుతుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అదృశ్యమవుతుంది. ప్రజలు దీనిని దేవుడి లీలగా భావిస్తారు.

ఉలూరు (ఐయర్స్ రాక్), ఆస్ట్రేలియా: ఉలూరు అనేది ఆస్ట్రేలియాలో ఉన్న ఒక పెద్ద ఇసుకరాయి శిల. ఇది తాబేలు పెంకులా కనిపిస్తుంది. ఈ కొండ ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలాసార్లు రంగు మారుతుందని చెబుతారు. ఇలా రంగులు ఎందుకు మారుతున్నాయో ఇప్పటి వరకు తెలియదు.

కొడిన్హి, భారతదేశం: కారెల్‌లో ఉన్న ఈ గ్రామ రహస్యం ఇప్పటికి తెలియలేదు. ప్రపంచంలో కేవలం కవలలు మాత్రమే ఉన్న ఏకైక గ్రామం ఇది.

నోరిల్స్క్, రష్యా: ఈ ప్రదేశం ప్రపంచంలోనే అతి శీతల ప్రదేశం. ఇక్కడ సగటు వార్షిక ఉష్ణోగ్రత మైనస్ 10°Cగా ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 55° C అవుతుంది. దీనిని ధనిక నగరం అని కూడా అంటారు.





























