Ravi Kiran |
Updated on: Jul 08, 2021 | 11:14 AM
సాధారణంగా సండే వస్తే చాలు.. నాన్-వెజ్ ప్రియులంతా కూడా చికెన్ షాపుల ముందు క్యూ కడతారు. ప్రస్తుతం కరోనాకాలం కాబట్టి పౌష్టికాహారాన్ని తినమని వైద్యులు సూచించడంతో.. చాలామంది చికెన్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ తరుణంలో చికెన్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. దీనితో సామాన్యులకు అందుబాటులో లేనంతగా ధరలు ఒక్కసారిగా పెరుగుతూ పోతున్నాయి.
వారం రోజుల వ్యవధిలో చికెన్ ధర రూ. 100కి పైగా పెరిగింది. కొన్ని ఏరియాల్లో కిలో చికెన్ ధర రూ. 285 ఉండగా.. తాజాగా అది కాస్తా రూ. 300కి చేరుకుంది.
అధికారుల నియంత్రణ లేకపోవడం, మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలను వ్యాపారాలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు. దీనితో చికెన్ కొనాలంటేనే సామాన్యులు జేబులకు చిల్లు పడుతోంది.