Apsarkonda Water falls : కర్ణాటక దేవతల సరస్సు.. ఇందులో అప్సరసలు రోజూ స్నానం చేస్తారట..

అప్సరకొండ జలపాతం ఎన్నో పర్యాటక ఆకర్షణలతో కూడుకుని ఉంటుంది. ఈ గ్రామంలోని అందాలు, జలపాతం

  • uppula Raju
  • Publish Date - 6:28 am, Sat, 27 February 21
1/4
అప్సర కొండ అంటే దేవతల కొలను అని అర్ధం. దేవతలు స్నానం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చే వారని పురాణ కధనం. సిటీ లైఫ్ నుండి దూరంగా ప్రకృతి అందాల మధ్య సమయం గడపాలని కోరుకునే వారికి ఈ గ్రామం సరైన ఎంపిక.
2/4
అప్సరకొండ జలపాతం ఎన్నో పర్యాటక ఆకర్షణలతో కూడుకుని ఉంటుంది. ఈ గ్రామంలోని అందాలు, జలపాతం హొయలు టూరిస్టులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.
3/4
సుమారు 50 అడుగుల ఎత్తు నుండి పడే అప్సరకొండ జలపాతాలు క్రింద సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులోకి వెళతాయి. టూరిస్టులు మెరిసే జలపాతం దృశ్యాలతో పాటు కొండ పై నుండి అద్భుతమైన సూర్యాస్తమయం దృశ్యాలను కూడా ఆస్వాదించవచ్చు.
4/4
అప్సరకొండకు ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవడం ఒక గొప్ప అనుభవం అని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో పర్యాటకులు సందర్శించేందుకు అనేక సహజ గుహలు కూడా ఉన్నాయి. పాండవులు వనవాసం సమయంలో ఈ గుహల్లో కొంత కాలం నివసించినట్లు పురాణ కధనం ఉంది.