Vinegar for Home: ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయా..? ఒక స్పూన్ వెనిగర్‌తో చిటికెలో తరిమేయండి!
తెలుగు వారి వంటల్లో వెనిగర్‌ను పెద్దగా ఉపయోగించరు. అయినా అనేక ఇళ్లలోని వంటగదుల్లో వెనిగర్ బాటిల్ ఉంటుంది. అందుకు కారణం లేకపోలేదు. వెనిగర్ వంటగదిని శుభ్రంగా ఉంచడం నుంచి కూరగాయలను కడగటం వరకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కేవలం ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ అన్ని పనులు చక్క బెడుతుంది. వంటగదిలోని గోడలు లేదా టేబుల్స్‌పై మొండి మరకలను తొలగించడానికి వెనిగర్ ఉపయోగించవచ్చు. వెనిగర్‌ని నీటితో కలిపి వంటగది మొత్తాన్ని శుభ్రం చేస్తే..
Updated on: Jan 30, 2024 | 12:38 PM

తెలుగు వారి వంటల్లో వెనిగర్‌ను పెద్దగా ఉపయోగించరు. అయినా అనేక ఇళ్లలోని వంటగదుల్లో వెనిగర్ బాటిల్ ఉంటుంది. అందుకు కారణం లేకపోలేదు. వెనిగర్ వంటగదిని శుభ్రంగా ఉంచడం నుంచి కూరగాయలను కడగటం వరకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కేవలం ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ అన్ని పనులు చక్క బెడుతుంది.

వంటగదిలోని గోడలు లేదా టేబుల్స్‌పై మొండి మరకలను తొలగించడానికి వెనిగర్ ఉపయోగించవచ్చు. వెనిగర్‌ని నీటితో కలిపి వంటగది మొత్తాన్ని శుభ్రం చేస్తే.. జిడ్డు మరకలన్నీ తొలగిపోతాయి. బట్టలు దుర్వాసన వస్తుంటే.. బట్టలు ఉతికేటప్పుడు వెనిగర్ ఉపయోగించవచ్చు. బట్టలు ఉతుకుతున్నప్పుడు ఒక కప్పు వెనిగర్‌ను సబ్బు నీటిలో కలపాలి. ఇది బట్టల చెడు వాసనలను తొలగిస్తుంది.

ఇంటి దుర్వాసనను తొలగించేందుకు కూడా వెనిగర్ ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో వెనిగర్ పోసి గది మూలలో ఉంచండి. ఇది గది నుంచి వచ్చే దుర్వాసనలను తొలగిస్తుంది. అంతే కాకుండా వెనిగర్ నీళ్లలో కలిపి ఇంటి తలుపులు, కిటికీలను శుభ్రం చేసుకోవచ్చు.

వెనిగర్ ఇంటిని శుభ్రపరచడంతో పాటు, జుట్టు మెరుపును పెంచుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్‌ని నీటిలో కలిపి తలకు, జుట్టుకు స్ప్రే చేయండి. ఇది జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే మార్కెట్ నుంచి పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసిన తర్వాత, వాటిని సాధారణ నీటిలో కడిగేటప్పుడు ఆ నీటిలో కొన్ని చుక్కల వెనిగర్ కలపండి. వెనిగర్ కలిపిన నీటితో పండ్లు, కూరగాయలను కడగడం వల్ల వాటిపై ఉన్న రసాయనాలన్నీ సులువుగా తొలగిపోతాయి.

ఇంట్లో చీమల బెడద పెరిగిందా? అయితే నీరు, వెనిగర్‌లను సమాన భాగాలుగా కలిపి, ఈ మిశ్రమాన్ని చీమలపై స్ప్రే చేయండి. అంతే చీమలతోపాటు ఇంట్లో పురుగుల బెడద కూడా అంతమవుతుంది. కీటకాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ నీటిని పిచికారీ చేస్తే కీటకాలు ఇంట్లోకి రావు.




