- Telugu News Photo Gallery Vastu Tips: Good luck if you have this plant in your home, Check here is details in Telugu
Vastu Tips: ఈ మొక్క మీ ఇంట్లో కనక వర్షమే.. ఐశ్వర్య వంతులు అయిపోతారట..
సాధారణంగా ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అందరి ఇళ్లల్లో తులసి మొక్క అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గులాభి, మనీ ప్లాంట్ వంటివి కూడా ఇప్పుడు సర్వ సాధారణమైనవి. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్‌లో కూడా అనేక రకాలైన మొక్కలు వచ్చేవి. ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కిచెన్‌లో, బెడ్‌రూమ్, బాత్రూమ్‌లో కూడా మొక్కల్ని పెడుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్క..
Updated on: Mar 22, 2024 | 2:42 PM

సాధారణంగా ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అందరి ఇళ్లల్లో తులసి మొక్క అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గులాభి, మనీ ప్లాంట్ వంటివి కూడా ఇప్పుడు సర్వ సాధారణమైనవి. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్‌లో కూడా అనేక రకాలైన మొక్కలు వచ్చేవి.

ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కిచెన్‌లో, బెడ్‌రూమ్, బాత్రూమ్‌లో కూడా మొక్కల్ని పెడుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్క మీ ఇంట్లో అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇంట్లో 'జేడ్ ప్లాంట్' పెంచుకోవడం చాలా శుభ ప్రదం. దీన్ని క్రాసులా అని కూడా పిలుస్తారు. ఇది బెస్ట్ ఇండోర్ ప్లాంట్. ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే.. డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తుందట.

ఇంట్లోని పాజిటివ్‌నెస్ కూడా పెంచుతుందట. అలాగే ఇంటి అందాన్ని కూడా ఇది రెట్టింపు చేస్తుంది. జేడ్ మొక్కను ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవాలట. ఈ దిశలో ఉంచితే.. ఇంట్లో ఆర్థిక సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.

ఇంట్లో సుఖఃశాంతులను తీసుకువస్తుంది. అలాగే ప్రధాన ద్వారం కుడి వైపున ఈ మొక్కను పెడితే.. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. ఆఫీసుల్లో అయితే నైరుతి తిశలో పెట్టకోవడం మంచిది.




