Sreeleela: ఆ స్టార్ హీరోయిన్‌కు ఎంత కష్టమొచ్చిందో.? తొందరపడిందా.?
4 నెలల్లో అరడజన్ సినిమాలు.. ఏ పోస్టర్‌పై చూసినా ఆమె బొమ్మే.. ఏ హీరోతో చూసినా ఆమె డాన్సులే.. కానీ ఇవన్నీ ఒక్కసారిగా మాయం అయిపోయాయి. సంక్రాంతి తర్వాత కనిపించడమే మానేసింది ఆ బ్యూటీ. ఈ పాటికే ఆ హీరోయిన్ ఎవరో తెలిసిపోయుంటుందిగా.! ఆ మీరనుకున్నదే.. శ్రీలీల గురించే ఆ ఇంట్రో అంతా. అసలిప్పుడు ఆమె ఏం చేస్తున్నారు..? రాఘవేంద్రరావు స్కూల్ నుంచి వచ్చిన హీరోయిన్లకు మామూలుగానే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.