Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Festival Of India: ఢిల్లీలో ‘టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ సందడి.. దుర్గామత ఆశీస్సులు పొందిన పలువురు ప్రముఖులు..

TV9 Festival Of India: అంతటా దసరా సందడి నెలకొంది. ఢిల్లీలో టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ‘టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ వేడుక అంగరంగా వైభవంగా జరుగుతోంది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియం వేదికగా TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 24 వరకు జరగనుంది. ఉదయం నుంచి రాత్రి వేరకు దుర్గా మాతకు పూజలతోపాటు.. పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా టీవీ9 నెట్వర్క్ ఏర్పాటు చేసింది.

Shaik Madar Saheb

|

Updated on: Oct 22, 2023 | 4:37 PM

అంతటా దసరా సందడి నెలకొంది. ఢిల్లీలో టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ‘టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ వేడుక అంగరంగా వైభవంగా జరుగుతోంది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియం వేదికగా TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 24 వరకు జరగనుంది. ఉదయం నుంచి రాత్రి వేరకు దుర్గా మాతకు పూజలతోపాటు.. పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా టీవీ9 నెట్వర్క్ ఏర్పాటు చేసింది. అయితే, రెండో రోజు కార్యక్రమానికి టీవీ9 ఎండీ, సీఈఓ బరున్ దాస్ సహా.. పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మంత్రి గోపాల్ రాయ్, బీజేపీ నేత తరుణ్ చుగ్, ఎంపీ గౌతమ్ గంభీర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ అధినేత పవన్ ఖేడా కూడా చేరుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

1 / 9
ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను టీవీ9 నెట్‌వర్క్ ఢిల్లీలో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై.. అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గోపాల్ రాయ్ కూడా ఈ ఉత్సవానికి హాజరై.. దుర్గామాతకు హారతి ఇచ్చి ఆశీస్సులు పొందారు.

2 / 9
బీజేపీ నేత తరుణ్ చుగ్ కూడా టీవీ9 ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గామాతను దర్శనం చేసుకున్నారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన పలు దుకాణాలను సైతం సందర్శించి కొనుగోళ్లు చేశారు.

3 / 9
 'టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'లో కాంగ్రెస్ అధినేత పవన్ ఖేడా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గామాతకు పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు.

4 / 9
భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా రెండో రోజు 'టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'లో పాల్గొన్నారు. తర్వాత దుర్గాదేవిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నాను.

5 / 9
టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ అద్భుతమైన కార్యక్రమంటూ టీవీ9ను ప్రశంసించారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రజలు చాలామంది పాల్గొంటున్నారన్నారు. దుర్గా దేవిని పూజించడంతో పాటు, మన రోజువారీ అవసరాలకు కూడా షాపింగ్ చేయవచ్చు.. అంటూ ఆయన చెప్పారు.

6 / 9
ఈ కార్యక్రమంలో టీవీ9 గ్రూప్ హోల్ టైమ్ డైరెక్టర్ హేమంత్ శర్మ కూడా పాల్గొన్నారు. ఉత్సవాల్లో రెండవ రోజు కూడా ప్రజలు దుర్గాదేవి దర్శనం చేసుకోవడంతోపాటు.. షాపింగ్ చేశారు. అంతేకాకుండా వివిధ రుచికరమైన వంటకాలను కూడా ఆస్వాదించారు.

7 / 9
ఉత్సవాల్లో రెండో రోజు శనివారం ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంను పెద్ద ఎత్తున సందర్శించారు. ఈ సందర్భంగా పాటలు, సంగీతంతో పాటు పలు కార్యక్రమాలను తిలకించి ఆస్వాదించారు.

8 / 9
TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని.. టీవీ9 కార్యక్రమాలను అభినందిస్తున్నారు.

9 / 9
Follow us