Video: ఏం గుండెరా భయ్యా.. బీసీసీఐకే కౌంటరిచ్చిన సైన్ సెన్సేషన్.. ఈసారి ఏకంగా పిచ్‌పైనే
IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ లెగ్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠి మరోసారి బీసీసీఐ రూల్‌ను బ్రేక్ చేశాడు. వరుసగా రెండు మ్యాచ్‌లలో అతని సెలబ్రేషన్స్‌కు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. కానీ, అతను ఏమాత్రం భయపడలేదు. మరోసారి రూటు మార్చి అవే సెలబ్రేషన్స్‌తో హల్చల్ చేశాడు.

దిగ్వేష్ రాఠి తన బౌలింగ్‌తో ఐపీఎల్‌లో హల్చల్ చేస్తున్నాడు. వికెట్ పడిన వెంటనే నోట్‌బుక్ వేడుకతో సంచలనంగా మారాడు. ఈ కారణంగా అతను రెండు మ్యాచ్‌లలో జరిమానాకు గురయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో దిగ్వేష్‌కు బీసీసీఐ జరిమానా విధించింది. కానీ, కీలక విషయం ఏమిటంటే, ఇప్పటికే రెండుసార్లు జరిమానా పడినా.. నేడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుతోన్న మ్యాచ్‌లో దిగ్వేష్ రూటు మార్చి మరోసారి సైన్ సెలబ్రేషన్ చేశాడు. ఈసారి సునీల్ నరైన్‌ను అవుట్ చేసిన వెంటనే దిగ్వేష్ ఈ వేడుక చేసుకున్నాడు. కోల్‌కతా ఇన్నింగ్స్ 7వ ఓవర్లో నరైన్‌ను అవుట్ చేసిన వెంటనే, దిగ్వేష్ సైన్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
రూటు మార్చిన దిగ్వేష్..
అయితే, ఈసారి దిగ్వేష్ రూటు మార్చుకున్నాడు. గత రెండు మ్యాచ్‌లలో, దిగ్వేష్ తన చేతులతో సైన్-సైనింగ్ సెలబ్రేషన్స్ చేయగా.. ఈసారి మైదానంలోని గడ్డిపై సంతకం చేస్తూ కనిపించాడు. దిగ్వేష్ ఈ సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దిగ్వేష్ సెలబ్రేషన్స్ చూస్తే, అతను బీసీసీఐ జరిమానా వల్ల ప్రభావితం కాలేదని తెలుస్తోంది. అందుకే రూటు మార్చి మరోసారి ఇలానే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.
దిగ్వేష్ రతికి రెండుసార్లు జరిమానా..
Instant impact! 💥👍🏻#DigveshRathi comes into the attack and gets the wicket of his idol, #SunilNarine! 🙌🏻
Watch the LIVE action ➡ https://t.co/RsBcA7HaAO #IPLonJioStar 👉 #KKRvLSG | LIVE NOW on Star Sports 2, Star Sports 2 Hindi & JioHotstar! pic.twitter.com/AkNVKFeQtw
— Star Sports (@StarSportsIndia) April 8, 2025
దిగ్వేష్ రతికి రెండుసార్లు జరిమానా పడింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రియాంష్ ఆర్య వికెట్ తీసిన వెంటనే, తన చేతులపై నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేశాడు. దీంతో అతని మ్యాచ్ ఫీజును మొదటిసారి 25 శాతం తగ్గించారు. ఆ తరువాత, రతి మళ్ళీ ముంబై ఇండియన్స్ పై ఇలాంటి వేడుక చేశాడు. రెండోసారి 50 శాతం జరిమానా విధించారు. మరి మూడోసారి రతికి ఎంత శాతం జరిమానా విధిస్తారో చూడాలి. అయితే, జరిమానా విధించాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించలేదు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..