IPL 2025: ఇదే ట్విస్ట్ లార్డ్ భాయ్! వరుసగా 5 వైడ్ బాల్స్.. కట్ చేస్తే అదిరిపోయిన ట్విస్ట్ ఇచ్చిన అన్ సోల్డ్ ప్లేయర్!
శార్దూల్ ఠాకూర్ ఒకే ఓవర్‌లో ఐదు వైడ్ బంతులు వేసి విమర్శలు ఎదుర్కొన్నా, ఆ తర్వాత కీలక వికెట్ తీసి మ్యాచ్‌కు ట్విస్ట్ ఇచ్చాడు. నికోలస్ పూరన్ అద్భుత ఇన్నింగ్స్‌తో 87 నాటౌట్ చేసి 2,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. లక్నో జట్టు భారీ స్కోరు చేయడంలో మిచెల్ మార్ష్, మార్క్రమ్ ముఖ్యపాత్ర పోషించారు. కేకేఆర్ బ్యాటర్లు విఫలమై, చివర్లో రింకు పోరాటం చేసినా లాభం లేకుండా పోయింది.

ఈ రోజు ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పేసర్ శార్దూల్ ఠాకూర్ ఇచ్చిన ఓవర్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ 13వ ఓవర్‌లో వరుసగా ఐదు వైడ్ బంతులు వేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ సమయంలో కెప్టెన్ రిషబ్ పంత్ నిరాశతో స్పందించాడు. ఇప్పటివరకు టోర్నమెంట్‌లో మంచి ఫామ్‌లో ఉన్న శార్దూల్, ఆ ఓవర్‌లో తడబడినప్పటికీ చివరికి తన లయను అందుకుని నికోలస్ పూరన్ క్యాచ్ సహాయంతో KKR కెప్టెన్‌ను అవుట్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో మరో ముఖ్యమైన ఘనత నికోలస్ పూరన్ ఖాతాలో చేరింది. 36 బంతుల్లో ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 87* పరుగులు చేసిన పూరన్, ఐపీఎల్‌లో 2,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అతను ఇది సాధించేందుకు కేవలం 1,198 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు, ఇది ఈ ఘనత సాధించిన రెండవ అత్యంత వేగవంతమైన ఆటగాడిగా అతన్ని నిలబెట్టింది. మొదటిగా ఈ ఘనతను ఆండ్రీ రస్సెల్ 1,120 బంతుల్లో సాధించాడు. భారత బ్యాట్స్‌మెన్‌లో వీరేంద్ర సెహ్వాగ్ ఈ మైలురాయిని 1,211 బంతుల్లో సాధించాడు.
ప్రస్తుతం ఐపీఎల్ 2025లో పూరన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. ఐదు మ్యాచ్‌లలో 72.00 సగటుతో, 225 స్ట్రైక్ రేట్‌తో 288 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు టోర్నీలో 24 సిక్సర్లు కొట్టి, విపరీతమైన దాడి శైలితో ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టాడు. పూరన్ గతంలో పంజాబ్ కింగ్స్ (2019–21), సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం LSG తరపున 34 మ్యాచ్‌లలో 47.70 సగటుతో 1,145 పరుగులు చేసి, ఎనిమిది హాఫ్ సెంచరీలతో రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
మ్యాచ్ విషయానికి వస్తే, KKR టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. LSG బ్యాటర్లు ఆదిలోనే దూకుడు ప్రదర్శించారు. ఐడెన్ మార్క్రమ్ 28 బంతుల్లో 47 పరుగులు చేయగా, మిచెల్ మార్ష్ 48 బంతుల్లో 81 పరుగులతో ఆకట్టుకున్నాడు. పూరన్‌తో కలిసి మార్ష్ 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పూరన్ చివరి ఓవర్లలో రెచ్చిపోయి 36 బంతుల్లో అజేయంగా 87 పరుగులు చేసి, తన జట్టును 238/3 స్కోరుకు చేర్చాడు.
బౌలింగ్ విభాగంలో హర్షిత్ రాణా 2/51తో కొంత మేరకు ప్రభావం చూపించినా, స్పెన్సర్ జాన్సన్ మూడు ఓవర్లలో 46 పరుగులు ఇచ్చి ఘోరంగా విఫలయ్యాడు. ఆండ్రీ రస్సెల్ రెండు ఓవర్లలో 2/32తో కొంతమేరకు వెనక్కి తిప్పేందుకు ప్రయత్నించాడు. అయితే, సునీల్ నరైన్ (0/38), వరుణ్ చక్రవర్తి (0/31) లాంటి ప్రధాన స్పిన్నర్లు పూర్తిగా ఫెయిలయ్యారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ప్రదర్శనకు కేకేఆర్ బౌలింగ్ తట్టుకోలేకపోయింది.
చేజింగ్ కి దిగిన కేకేఆర్ లక్నో బౌలింగ్ దాటికి కుదేలయింది. చివర్లో రింకు ఒంటరి పోరాటం చేసినా, ఫలితం దక్కలేదు. లక్నో చేతిలో రహానే జట్టు 3 వికెట్ల నష్టాన్ని చవి చూసింది.
5 consecutive wides by shardul thakur 😳 what's going on? #kkrvslsg pic.twitter.com/BMb0v4UTBv
— Naman🏴 (@kingisfurious) April 8, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



