వేసవిలో ఖాళీ కడుపుతో కీర దోస తినొచ్చా?

08 April 2025

TV9 Telugu

TV9 Telugu

మండే ఎండలో శరీరానికి చలువనిచ్చే పండ్లలో కీరదోస ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. వీటిల్లో పుష్కలంగా నీరు ఉంటుంది

TV9 Telugu

అంతేకాకుండా పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ కె, సి వంటి పోషకాలు కూడా ఇందులో అధికంగా ఉంటాయి. కీరదోస శరీరంలోని విషతుల్యాలు తొలగిపోవడంతో పాటు చెడు కొవ్వు తగ్గించి బరువు కూడా అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

అందుకే వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి, హైడ్రేట్ చేయడానికి అధిక మంది కీరదోస తినేందుకు మక్కువ చూపుతుంటారు. అయితే కీరదోస వివిధ మార్గాల్లో ఆహారంలో చేర్చుకుంటారు

TV9 Telugu

చాలా మంది వేసవిలో ఖాళీ కడుపుతో దోసకాయ తినడానికి ఇష్టపడతారు. కానీ కొంతమందికి ఖాళీ కడుపుతో దోసకాయ తినడం వల్ల కడుపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది

TV9 Telugu

ఖాళీ కడుపుతో కీరదోస తినడం చాలా మందికి సరిపోదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో కీరదోస తినడం వల్ల అసిడిటీ సమస్య తలెత్తుతుంది 

TV9 Telugu

అయితే మరికొందరికి మాత్రం ఇలా జరగదు. అందుకు కారణం ఇది ప్రతి వ్యక్తి జీర్ణశక్తిని బట్టి దీని ప్రభావం ఆధారపడి ఉంటుంది. కీరదోస కడుపు శుభ్రంగా ఉండి, ఆమ్లత్వం సమస్యలేని వారికి సరిపోతుంది

TV9 Telugu

కానీ ఆమ్లత్వం, పిత్త సమస్యలు ఉన్నవారు ఈ విధమైన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇటువంటి వారిలో వాత, పిత్త, కఫాలు సమతుల్యంగా ఉండవు. ఖాళీ కడుపుతో కీరదోస తినండం వీరికి అంత మంచిది కాదు

TV9 Telugu

ఇలాంటి వారు ఉదయం పూట తేలికపాటి అల్పాహారం తిన్న తర్వాత మాత్రమే అంజూర పండ్లు, ఎండుద్రాక్ష, ఏదైనా ఇతర పండ్లతో కీరదోస  తినవచ్చు. కానీ మర్చిపోయి కూడా ఖాళీ కడుపుతో కీరదోస తినకూడదు. ఇది ఆమ్లత్వ సమస్యను మరింత అధికం చేస్తుంది