జిహ్వకు ఆనందాన్ని ఇచ్చే ఇక్షురసం అదేనండీ.. చెరకు రసం ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇక వేసవి కాలం వచ్చిందంటే అందరి చూపు చెరకు రసం వైపే
TV9 Telugu
మండే వేడిలో చెరకు రసం ఉపశమనం ఇస్తుంది. కడుపులోకి చల్లగా జరే చెరకు రసం తక్షణ శక్తిని అందిస్తుంది. వేసవిలో చెరకు రసం రిఫ్రెషింగ్ అనుభూతిని కూడా ఇస్తుంది
TV9 Telugu
చెరకురసంలోని లవణాలు నోటి దుర్వాసనను వదిలించి దంతాలు పుచ్చిపోకుండా కాపాడతాయి. కామెర్ల వ్యాధి తగ్గించటంలో చెరకురసం మహత్తరంగా పని చేస్తుంది
TV9 Telugu
జ్వరాన పడ్డప్పుడు కోల్పోయిన ప్రొటీన్‌ను చెరకు రసం భర్తీ చేయటంలో తోడ్పడుతుంది. మూత్రసంబంధ సమస్యలను చెరకు రసం పరిష్కరిస్తుంది
TV9 Telugu
కానీ ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కొందరు దీనికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా రక్తంలో చక్కెర పెరిగే వ్యక్తులు చెరకు రసం అస్సలు తాగకూడదు
TV9 Telugu
ఇందులో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు సమస్యలను మరింత పెంచుతుంది. అలాగే జీర్ణక్రియ బాగా లేనివారు, త్వరగా ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యేవారు కూడా చెరకు రసం తాగకూడదు
TV9 Telugu
వాంతులు లేదా వికారం వచ్చేవారు కూడా చెరకు రసం తాగకూడదు. అధిక బరువు ఉన్నవారు కూడా చెరకు రసాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే అందులో ఉండే చక్కెర బరువును మరింత పెంచుతుంది
TV9 Telugu
రక్తం పలుచబడటానికి మందులు వాడుతున్నవారు, గుండె సమస్యలు ఉన్నవారు చెరకు రసం తాగకూడదు. ఎందుకంటే చెరకులో రక్తాన్ని పలుచబరిచే పోలికోసనాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తాన్ని పలుచబరిచే మందులపై తీవ్ర ప్రభావం చూపుతుంది