ఏం అమ్మాయిరా బాబు.. మైండ్ లో నుంచి పోవడం లేదు.. కవ్విస్తున్న కాయదు లోహర్
కాయదు లోహర్ మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. ఈ బ్యూటీ 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. ప్రస్తుతం పూణేలో సెటిల్ అయ్యింది కాయదు. తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించిన కాయదు, 2021లో పూణే ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్‌లో విజేతగా నిలిచింది. అదే సంవత్సరం కన్నడ చిత్రం "ముగిల్‌పేట"తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
Updated on: Apr 08, 2025 | 3:26 PM

కాయదు లోహర్ మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. ఈ బ్యూటీ 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. ప్రస్తుతం పూణేలో సెటిల్ అయ్యింది కాయదు.

తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించిన కాయదు, 2021లో పూణే ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్‌లో విజేతగా నిలిచింది. అదే సంవత్సరం కన్నడ చిత్రం "ముగిల్‌పేట"తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత ఆమె మలయాళ చిత్రం "పాథోన్‌పథం నూట్టండు" లో నటించింది, ఇది 2022 సెప్టెంబర్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో "పులి: ది నైంటీంత్ సెంచరీ" పేరుతో 2023లో విడుదలైంది.

అదే ఏడాది ఆమె తెలుగు చిత్రం "అల్లూరి"లో కూడా నటించింది. 2025లో విడుదలైన తమిళ చిత్రం "డ్రాగన్" ఆమెకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి, ఆమె నటన మరియు గ్లామర్‌కు ప్రేక్షకుల ప్రశంసలు అందాయి.

అంతేకాకుండా, ఆమె మరాఠీ చిత్రం "ఐ ప్రేమ్ యు" 2023లో విడుదలైంది. ప్రస్తుతం ఆమె "తారం", "ఇదయం మురళి" వంటి చిత్రాల్లో నటిస్తోంది. కాయదు లోహర్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, తన గ్లామరస్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. సింపుల్ లుక్‌లోనైనా, స్టైలిష్ దుస్తుల్లోనైనా ఆమె అందం అందరినీ ఆకర్షిస్తుంది.




