- Telugu News Photo Gallery Cinema photos Tollywood Biggies Aim For Sankranti Festival Release Which Hero WIll Be In Race Who Will Change The Date
సంక్రాంతికి క్యూ కడుతున్న అరడజన్ సినిమాలు.. ప్రజెంట్ సిచ్యువేషన్‌పై స్పెషల్ స్టోరీ
చూస్తుండగానే దసరా రేస్ అయిపోయింది.. అనుకున్నట్లుగానే మూడు సినిమాలు వచ్చేసాయి. ఎవరూ డేట్ అయితే మార్చుకోలేదు. మరి సంక్రాంతికి కూడా ఇదే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా..? చెప్పినట్లుగానే చెప్పిన డేట్‌కు అరడజన్ సినిమాలు వచేస్తాయా..? లేదంటే ఏ సినిమా అయినా చివరి నిమిషంలో డ్రాప్ అయ్యే అవకాశం ఉందా..? సంక్రాంతి ప్రజెంట్ సిచ్యువేషన్‌పై స్పెషల్ స్టోరీ.. సంక్రాంతికి మూడు నెలలు ఉండగానే రేస్ ఆసక్తికరంగా మారింది.
Updated on: Oct 22, 2023 | 2:39 PM

చూస్తుండగానే దసరా రేస్ అయిపోయింది.. అనుకున్నట్లుగానే మూడు సినిమాలు వచ్చేసాయి. ఎవరూ డేట్ అయితే మార్చుకోలేదు. మరి సంక్రాంతికి కూడా ఇదే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా..? చెప్పినట్లుగానే చెప్పిన డేట్‌కు అరడజన్ సినిమాలు వచేస్తాయా..? లేదంటే ఏ సినిమా అయినా చివరి నిమిషంలో డ్రాప్ అయ్యే అవకాశం ఉందా..? సంక్రాంతి ప్రజెంట్ సిచ్యువేషన్‌పై స్పెషల్ స్టోరీ..

సంక్రాంతికి మూడు నెలలు ఉండగానే రేస్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పండక్కి మేమొస్తున్నామంటూ.. మహేశ్ గుంటూరు కారం, రవితేజ ఈగల్, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నా సామిరంగా, యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఖర్చీఫ్ వేసాయి. వీళ్లు సరిపోరన్నట్లు తమిళం నుంచి రజినీ లాల్ సలామ్, శివకార్తికేయన్ అయలాన్ కూడా రేసులోనే ఉన్నాయి.

సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా.. గుంటూరు కారందే సింహభాగం. అందులో ఎలాంటి డౌట్స్ లేవు. జనవరి 12నే విడుదల కానుందీ సినిమా. ఇక సైంధవ్, ఫ్యామిలీ స్టార్ వరసగా జనవరి 13, 14 తేదీల్లో రానున్నాయి. వెంకటేష్ వెనక సురేష్ బాబు, విజయ్ వెనక దిల్ రాజు ఉన్నారు కాబట్టి ఈ రెండు సినిమాలకు థియేటర్స్ ఇష్యూస్ ఉండవు. కాబట్టి రావడం ఖాయం చేసుకోవచ్చు.

ఎటొచ్చీ రవితేజ ఈగల్ టీం సంక్రాంతికి వస్తామంటున్నారు కానీ క్లారిటీ లేదు. నాగార్జున నా సామిరంగ షూటింగ్ ఇంకా సగం కూడా కాలేదు కాబట్టి పండక్కి వస్తుందా లేదా అనేది సస్పెన్స్.

అన్నీపోను చివర్లో మిగిలింది హనుమాన్. ఇంతమంది స్టార్స్ మధ్య తేజ సజ్జ సినిమా వస్తుందా లేదా అనేది చూడాలి. డబ్బింగ్ సినిమాలు ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో చాలా కష్టం. మొత్తానికి చూడాలిక.. సంక్రాంతి రేస్ ఎలా ఉండబోతుందో..?




