Varun Tej- Lavanya Tripathi: పెళ్లి సందడి మొదలైంది.. ఇటలీ బయలుదేరిన వరుణ్.. బ్యాచిలరేట్ పార్టీలో లావణ్య.. ఫొటోస్
మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్యల త్రిపాఠిల వివాహం మరికొన్ని రోజుల్లో జరగనుంది. ఇటలీ వేదికగా జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఏర్పాట్లు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఇందుకోసం ఇటలీకి బయలు దేరాడు కాబోయే పెళ్లి కొడుకు వరుణ్ తేజ్.