- Telugu News Photo Gallery Cinema photos KGF Actress Srinidhi Shetty signed new movie with Siddu Jonnalagadda
Srinidhi Shetty New Movie: తెలుగులో క్రేజీ ఆఫర్ కొట్టేసిన కేజీఎఫ్ బ్యూటీ.. ఇంతకీ హీరో ఎవరో తెలుసా
కన్నడ చిత్ర పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను తెచ్చి పెట్టిన సినిమా 'కేజీఎఫ్'.'కేజీఎఫ్' సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, నటీనటులకు ఈ ఒక్క సినిమాతో వరుస అవకాశాలు తలుపుతట్టాయి. కానీ కేజీఎఫ్‌లో నటించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టికి మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదనే చెప్పాలి. తాజాగా శ్రీనిధి శెట్టికి కొత్త సినిమా ఆఫర్ వచ్చింది..
Updated on: Oct 22, 2023 | 8:21 PM

కన్నడ చిత్ర పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను తెచ్చి పెట్టిన సినిమా 'కేజీఎఫ్'.'కేజీఎఫ్' సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, నటీనటులకు ఈ ఒక్క సినిమాతో వరుస అవకాశాలు తలుపుతట్టాయి.

కానీ కేజీఎఫ్‌లో నటించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టికి మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదనే చెప్పాలి. తాజాగా శ్రీనిధి శెట్టికి కొత్త సినిమా ఆఫర్ వచ్చింది.

అది కూడా తెలుగు సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాకి తాజాగా ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు. తెలుగు తెరకెక్కనున్న ఈ మువీ టైటిల్ ‘తెలుసు కదా’. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టితోపాటు రాశి ఖన్నా కూడా నటిస్తోంది. శ్రీనిధి శెట్టికి ఇది మూడో సినిమా కావడం విశేషం.

శ్రీనిధి 'కేజీఎఫ్ 1, 2', తమిళ చిత్రం 'కోబ్రా' చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం 'తెలుసు కదా' సినిమాలో నటిస్తోంది. నీరజ కోన క్యాస్టూమ్ డిజైనర్ నుంచి దర్శకురాలిగా మారబోతోంది.

ఈ సినిమాతో అయినా శ్రీనిధి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయేమో వేచి చూడాల్సిందే. ఇక ఈ మువీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్స్ మీడియా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.




