Nitesh Tiwari’s Ramayana: రావణుడి పాత్రలో యష్.. ఎన్ని కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడో తెలుసా?

కేజీఎఫ్ ఫేమ్ సౌత్ సూపర్ స్టార్ యష్ ఒక్క సినిమాతో కనీవినీ ఎరుగని రీతిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం దేశం అంతా రాకీ భాయ్ అంటూ పిలుస్తోంది. వరసగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లిన ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ప్రస్తుతం KGF 3 మేకింగ్‌ జరుగుతోంది.నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ మువీలో యష్ రావణుడి పాత్రలో యష్‌ నటిస్తున్న సంగతి..

Srilakshmi C

|

Updated on: Oct 22, 2023 | 8:46 PM

కేజీఎఫ్ ఫేమ్ సౌత్ సూపర్ స్టార్ యష్ ఒక్క సినిమాతో కనీవినీ ఎరుగని రీతిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం దేశం అంతా రాకీ భాయ్ అంటూ పిలుస్తోంది. వరసగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లిన ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

1 / 5
ప్రస్తుతం KGF 3 మేకింగ్‌ జరుగుతోంది.నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ మువీలో యష్ రావణుడి పాత్రలో యష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటించనుండగా, సీత పాత్రలో అలియా భట్ నటిస్తున్నారు. మరోవైపు దక్షిణాది నటి సాయి పల్లవి సీత పాత్రలో నటించడానికి చిత్ర బృందం సంప్రదించిందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

2 / 5
అయితే ఈ సినిమాలో నటించేందుకు యశ్ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. చాలా మంది దక్షిణాది సూపర్ స్టార్లు తమ రెమ్యూనరేషన్ రూ.100 కోట్లకు పెంచినట్లు నెట్టింట వార్తలు వస్తున్నాయి.

3 / 5
అయితే యష్‌ మాత్రం ఈ మువీకి రూ.100 కోట్లు కాదు ఏకంగా రూ.150 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

4 / 5
కాగా బాలీవుడ్ రామాయణం షూటింగ్‌ పనులు ఇప్పటికే ప్రారంభం అయిందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ బాలీవుడ్ రామాయణం ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుందో లేదో.. యష్ బాలీవుడ్ అరంగేట్రం ఏ మేరకు తుఫాను సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.

5 / 5
Follow us