- Telugu News Photo Gallery Cinema photos Increasing demand for mythological films in Film Industry Telugu Entertainment Photos
Mythological Movies: పురాణాలకు పెరుగుతున్న డిమాండ్.. ఒకే కథ చుట్టూ ఇన్ని సినిమాలా.?
ఏ సినిమా తీసుకున్నా దాని మూలం మాత్రం మన ఇతిహాసాల్లోనే ఉంటుంది. వాటి నుంచే కథలు పుట్టాలి. అందుకే ఇతిహాసాలకు ఎప్నెడూ డిమాండ్ ఉంటుంది. జనరేషన్స్ మారినా.. విజువల్ ఎఫెక్ట్స్ యుగం నడుస్తున్నా.. నాటి రామయణ భారతాలకు ఉండే డిమాండ్ వేరు. తాజాగా మహాభారతం మరోసారి రాబోతుంది. ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. మరి దాని డీటైల్స్ ఏంటి..? జనరేషన్స్ మారుతున్నా.. మన పురాణాలకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు.
Updated on: Oct 23, 2023 | 8:01 AM

ఏ సినిమా తీసుకున్నా దాని మూలం మాత్రం మన ఇతిహాసాల్లోనే ఉంటుంది. వాటి నుంచే కథలు పుట్టాలి. అందుకే ఇతిహాసాలకు ఎప్నెడూ డిమాండ్ ఉంటుంది. జనరేషన్స్ మారినా.. విజువల్ ఎఫెక్ట్స్ యుగం నడుస్తున్నా.. నాటి రామయణ భారతాలకు ఉండే డిమాండ్ వేరు.

తాజాగా మహాభారతం మరోసారి రాబోతుంది. ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. మరి దాని డీటైల్స్ ఏంటి..? జనరేషన్స్ మారుతున్నా.. మన పురాణాలకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు.

ఇంకా చెప్పాలంటే నేటి తరానికి మరింత ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్‌తో మన ఇతిహాసాలను చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకులు. అందుకే ఇప్పటికీ మైథలాజికల్ మూవీస్ వస్తూనే ఉన్నాయి.

తాజాగా మరోసారి రామాయణ, మహాభారతాలు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఈ మధ్య ప్రభాస్‌తో ఆదిపురుష్ సినిమా చేసారు ఓం రౌత్. రామాయణాన్ని ఈ జనరేషన్‌కు తగ్గట్లు గ్రాఫిక్స్‌తో తెరకెక్కించారు రౌత్.

త్వరలోనే రామాయణం సినిమా చేయబోతున్నారు దంగల్ డైరెక్టర్ నితీష్ తివారి. తాజాగా పర్వ పేరుతో మహాభారతం ప్రాజెక్ట్‌ను 3 భాగాల్లో తీయనున్నట్లు ప్రకటించారు కాశ్మీర్ ఫైల్స్ ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి. ఇదే కాన్సెప్ట్‌తో నాలుగేళ్ళ కింద కన్నడలో కురుక్షేత్ర వచ్చింది.

మహాభారతంలోని 18 పర్వాలను తన సినిమాలో చూపించబోతున్నారు వివేక్ అగ్నిహోత్రి. 3 భాగాలుగా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. దీనికోసం దాదాపు 400 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తుంది.

మరోవైపు అల్లు అరవింద్ సైత్ రామాయణం సినిమా చేస్తానని ప్రకటించారు. మొత్తానికి జనరేషన్స్ మారుతున్నా.. ఏ తరానికి ఆ తరం మన పురాణాలపై మక్కువ చూపిస్తూనే ఉన్నారు.




