- Telugu News Photo Gallery Cinema photos Actress Sunaina hospitalized photos goes viral Telugu Actress Photos
Sunaina: హాస్పిటల్‌లో నటి.. సునయనకు ఏమైంది.? ఎందుకు ఇలా అయిపోయింది ఈ అమ్మడు.
నటి సునయనకు ఏమైంది? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆమె హాస్పిటల్‌లో ఎందుకు జాయిన్ అయ్యారు? అనే విషయం మీద ఇండస్ట్రీ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. సునయన ఎల్ల తెలుగమ్మాయి. నాగ్‌పూర్‌లో పెరిగినప్పటికీ, హైదరాబాద్‌తోనూ మంచి అనుబంధం ఉంది. కుమారి వర్సెస్ కుమారి సినిమాతో తెలుగులో కెరీర్ మొదలుపెట్టారు సునయన. టెన్త్ క్లాస్ సినిమాలో ఆమె చేసిన సంధ్య రోల్ కాస్త మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
Updated on: Oct 23, 2023 | 8:00 AM

నటి సునయనకు ఏమైంది? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆమె హాస్పిటల్‌లో ఎందుకు జాయిన్ అయ్యారు? అనే విషయం మీద ఇండస్ట్రీ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. సునయన ఎల్ల తెలుగమ్మాయి.

నాగ్‌పూర్‌లో పెరిగినప్పటికీ, హైదరాబాద్‌తోనూ మంచి అనుబంధం ఉంది. కుమారి వర్సెస్ కుమారి సినిమాతో తెలుగులో కెరీర్ మొదలుపెట్టారు సునయన. టెన్త్ క్లాస్ సినిమాలో ఆమె చేసిన సంధ్య రోల్ కాస్త మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

నాగ్‌పూర్‌లో పెరిగినప్పటికీ, హైదరాబాద్‌తోనూ మంచి అనుబంధం ఉంది. కుమారి వర్సెస్ కుమారి సినిమాతో తెలుగులో కెరీర్ మొదలుపెట్టారు సునయన. టెన్త్ క్లాస్ సినిమాలో ఆమె చేసిన సంధ్య రోల్ కాస్త మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

2009 తర్వాత కోలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు సునయన. తెలుగు సినిమాలకు దాదాపుగా దూరమయ్యారని అనుకుంటున్న తరుణంలో పెళ్లికి ముందు ప్రేమ కథ అని ఓ మూవీలో కనిపించారు. 2021లో ఆమె నటించిన రాజ రాజ చోర బాగా క్లిక్ అయింది.

శ్రీవిష్ణు భార్యగా ఆమె కనిపించిన తీరుకు ఫిదా అయ్యారు జనాలు. సునయన నటనలో మెచ్యూరిటీ కనిపిస్తోందని మెచ్చుకున్నారు. అలా కమ్‌బ్యాక్‌కి తెలుగులో మంచి అవకాశం వచ్చినా, తమిళ్ మీదే ఫోకస్ చేశారు సునయన. విశాల్ నటించిన లాఠీలోనూ ఆమే నాయికగా నటించారు.

రజనీకాంత్, నయనతార కలిసి నటించిన చంద్రముఖి సినిమా చూసి ఇన్‌స్పయర్ అయ్యి, సినిమా రంగంలో అడుగుపెట్టానని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు సునయన. ఇటీవల ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్న ఆమె గత వారం దుబాయ్ నుంచి పిక్స్ పెట్టారు.

ఆ ఫొటోలో ఆరోగ్యంగా కనిపించిన ఆమె ఉన్నట్టుండి హాస్పిటల్ బెడ్ మీద కనిపించారు. అదేదో సినిమా షూటింగ్‌లో భాగంగా తీసి ఉంటారని కొందరు అంటున్నప్పటికీ, సునయన త్వరగా కోలుకుని, సంపూర్ణారోగ్యంతో కనిపించాలని కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్.




