- Telugu News Photo Gallery Cinema photos Mrunal Thakur wants to make film in all languages and selecting different movies
Mrunal Thakur: డిఫరెంట్ రోల్స్ చేస్తున్న మృణాల్ ఠాకూర్.. తన ఫార్ములా సక్సెస్ అయ్యేనా ??
తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరెట్‌గా మారిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకుపోతున్నారు. తాజాగా తన మూవీ సెలక్షన్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు మృణాల్. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్ సీత మృణాల్ ఠాకూర్. సీతా రామం సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ తెర మీద ఎంత ట్రెడిషనల్‌గా కనిపించారో.. రియల్ లైఫ్‌లో అంత ట్రెండీ అనిపించుకుంటున్నారు.
Updated on: Oct 22, 2023 | 2:17 PM

తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరెట్‌గా మారిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకుపోతున్నారు. తాజాగా తన మూవీ సెలక్షన్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు మృణాల్.

ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్ సీత మృణాల్ ఠాకూర్. సీతా రామం సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ తెర మీద ఎంత ట్రెడిషనల్‌గా కనిపించారో.. రియల్ లైఫ్‌లో అంత ట్రెండీ అనిపించుకుంటున్నారు. అంతేకాదు మూవీ సెలక్షన్ విషయంలో కొత్తగా ట్రై చేస్తున్నారు మృణాల్.

ప్రజెంట్ సౌత్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తన మూవీ సెలక్షన్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒకే లాంగ్వేజ్‌కు ఫిక్స్ అయిపోవటం తనకు ఇష్టం లేదని, అన్ని భాషల్లోనూ తన మార్క్ చూపించాలనుందన్నారు. అందుకే హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు మృణాల్ ఠాకూర్.

క్యారెక్టర్ సెలక్షన్ విషయంలోనూ ప్రయోగాలు చేయటం తనకు ఇష్టమన్నారు మృణాల్. సీతారామమ్ సినిమాతో వచ్చిన ఇమేజ్‌ను అలాగే కంటిన్యూ చేయాలనుకోలేదని, అందుకే గ్లామర్ రోల్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పారు. అంతేకాదు అవకాశం వస్తే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేయాలనుందన్నారు మృణాల్ ఠాకూర్.

తెర మీద గార్జియస్ బ్యూటీ అనిపించుకున్న మృణాల్, సోషల్ మీడియాలో మాత్రం టూ హాట్ అనిపించేలా రచ్చ చేస్తుంటారు. అందుకే సీతారామమ్ తరువాత వచ్చిన ఇమేజ్‌ను షార్ట్ టైమ్‌లోనే బ్రేక్ చేశారు మృణాల్.




