Vijay Devarakonda: క్లాస్ మాస్ మిక్స్ చేస్తున్న రౌడీ హీరో.. ఫుల్ కాన్పిడెంట్‌గా విజయ్ దేవరకొండ..
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా సక్సెస్ విషయంలో విజయ్‌తో పాటు అభిమానులు కూడా ఫుల్ కాన్పిడెంట్‌గా ఉన్నారు. అంతేకాదు తమ కాన్ఫిడెన్స్‌కు కారణమేంటన్నది కూడా ఇంట్రస్టింగ్ ఫార్ములాతో ఎక్స్‌ప్లయిన్ చేస్తున్నారు. ఒక్క సినిమాతోనే నేషనల్ సెన్సేషన్‌గా మారిన హీరో విజయ్ దేవరకొండ. రౌడీ ఇమేజ్‌తో ఆకట్టుకుంటున్న విజయ్ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
Updated on: Oct 22, 2023 | 2:02 PM

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా సక్సెస్ విషయంలో విజయ్‌తో పాటు అభిమానులు కూడా ఫుల్ కాన్పిడెంట్‌గా ఉన్నారు. అంతేకాదు తమ కాన్ఫిడెన్స్‌కు కారణమేంటన్నది కూడా ఇంట్రస్టింగ్ ఫార్ములాతో ఎక్స్‌ప్లయిన్ చేస్తున్నారు.

ఒక్క సినిమాతోనే నేషనల్ సెన్సేషన్‌గా మారిన హీరో విజయ్ దేవరకొండ. రౌడీ ఇమేజ్‌తో ఆకట్టుకుంటున్న విజయ్ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. డిఫరెంట్ జానర్స్ ట్రై చేసినా బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ సక్సెస్ రాకపోవటంతో మిక్స్‌డ్ ఫార్ములాను ట్రై చేస్తున్నారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లైగర్, విజయ్‌తో పాటు అభిమానులకు కూడా షాక్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ కావటంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో పూర్తిగా ప్లాన్ మార్చేశారు రౌడీ బాయ్.

లైగర్ ఫెయిల్యూర్ తరువాత కంప్లీట్ కాంట్రస్ట్‌గా ఓ రొమాంటిక్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు విజయ్ దేవరకొండ. సమంతతో కలిసి చేసిన ఖుషి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా... బ్లాక్ బస్టర్ రేంజ్ సక్సెస్ అయితే కాలేదు. అందుకే నెక్ట్స్ సినిమా విషయంలో క్లాస్ మాస్ ఫార్ములాలను మిక్స్ చేస్తున్నారు.

తనకు గీత గోవిందం లాంటి బిగ్ హిట్ ఇచ్చిన పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు విజయ్. ఫ్యామిలీ స్టార్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో తన రొమాంటిక్ ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తూనే మాస్ యాక్షన్ కూడా చూపించబోతున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్‌లో అదే విషయాన్ని కన్ఫార్మ్ చేశారు. మరి ఈ ఫార్ములా విజయ్‌కి బ్లాక్ బస్టర్ తెచ్చి పెడుతుందేమో చూడాలి.




