Turmeric: పసుపు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా..? వామ్మో డేంజరేనంట..
పసుపులో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. ఇది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. వాస్తవానికి పసుపు ఒక మసాలా దినుసు.. దీనిని పురాతన కాలం నుంచి వంటలలో ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు.. పసుపును శతాబ్ధాలుగా ఆయుర్వేద చికిత్సలలో కూడా ఉపయోగిస్తున్నారు..
Updated on: Jul 13, 2024 | 7:54 PM

పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇమ్యూనిటీ సిస్టమ్స్ ను బలంగా మార్చుతుంది. వంటింట్లో వాడే పసుపు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పసుపులో యాంటి సెప్టిక్, కర్కు మిన్ అనే పోషకాలు ఎక్కువ. వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టాలంటే పసుపు పాలు అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. పాలల్లో పసుపు కలిపి తీసుకోవడంతో ఊపిరితిత్తుల్లో కఫం కరిగిపోయి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది. యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా గల పసుపు తల నొప్పి నుంచి రిలీఫ్ కలిగిస్తుంది.

పసుపును అల్లంతో కలిపి తింటే గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి అల్లం, పచ్చి పసుపును కలిపి పేస్ట్ చేసి రసాన్ని తయారు చేసుకోవాలి. ఈ పానీయం ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పసుపు ఉపయోగించే ఏదైనా వంటలో మిరియాలు కూడా ఉపయోగించవచ్చు. పసుపు, మిరియాలు కలిపి తీసుకుంటే ఇందులోని కర్కుమిన్ శోషణకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ఆహారం రుచిని కూడా పెంచుతుంది.

కడుపు నొప్పి: పసుపును అధికంగా తీసుకోవడం వల్ల కూడా దాని సున్నితత్వం కారణంగా కడుపు నొప్పి వస్తుంది. కావున మితంగా తీసుకోవాలి..

గ్యాస్ట్రిక్ : రోజువారీ ఆహారంలో పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య పెరిగితే.. మున్ముందు ఇది ప్రమాదకరంగా మారుతుంది..

కాలీఫ్లవర్ వండేటప్పుడు తప్పనిసరిగా పసుపు వాడాలి. పసుపు, జీలకర్ర, ఇతర మసాలా దినుసులతో కూర వండటం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది. దానితో పుష్టిగా ఉంటుంది.

దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో పసుపు ఉంటుంది. బెల్లం, చింతపండు, అల్లం వంటివి కూడా కిచెన్‌లో ఉంటాయి. గుండెల్లో మంట ఉన్నా లేకపోయినా పసుపు తప్పకుండా తీసుకోవాలి. ఈ మసాలా దినుసు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సాధారణ కూరగాయలు, చేపలు, మాంసం, గుడ్లు అన్ని వంటలలో పసుపును ఉపయోగిస్తారు. పాలలో కూడా చిటికెడు పసుపు కలుపుతారు. కానీ పసుపును వీటితో కలిపి తీసుకుంటూ మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.




