TTD: తిరుపతి పుట్టిన రోజు సందర్భంగా నగర ప్రజలకు ప్రత్యేక ఆహ్వానాలు.. టీటీడీ ఛైర్మన్ భూమన..
టెంపుల్ సిటీ బెర్త్ డే జరగనుంది. తిరుపతి ఆవిర్భవదినాన్ని పండగగా చేసుకుందాం అంటూ తిరుపతిలో పెద్ద ఎత్తున ఆహ్వాన పత్రిక అందించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. ఫ్లెక్సీలు కట్టి నగర ప్రజలకు చాటిచెప్పారు భూమన. రేపు తిరుపతి 894వ పుట్టిన రోజు పండగను అంతా కలసి చేసుకుందాం.. రండి అని నగరవాసులను ఆహ్వానించారు. గాంధీ రోడ్డులో ఫ్లెక్సీలు కట్టి, కరపత్రాలు పంచి ప్రచారం చేసిన భూమన తిరుపతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామన్నారు. ప్రపంచంలో మనషులు, జంతువులకు మాత్రమే పుట్టిన రోజు పండగలు నిర్వహించుకునే పరిస్థితి ఉందన్న భూమన ప్రాంతాలకు పుట్టిన రోజులు లేవన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
