Vizag Zoo: జూ లో తిరగలేక పోయే వారికి గుడ్ న్యూస్.. కొత్త ప్రయోగానికి శ్రీకారం.. ఎక్కడంటే..
సరదాగా జూకు వచ్చే సందర్శకులకు సరికొత్త అనుభవాన్ని అందించేందుకు విశాఖలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బ్యాటరీ సైకిళ్లను ప్రారంభించింది. సందర్శకులకు ఆ సైకిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.అధునాతన సాంకేతికత గల ఈ బ్యాటరీ సైకిళ్లు సందర్శకులకు జూలోని వివిధ జంతువులను ఓపికగా చూడడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. జూ చాలా విశాలంగా ఉండడంతో పాటు అన్ని జంతువులను చూడడానికి నడుచుకుంటూ తిరగాలంటే ఒక్కోసారి శక్తి ఉండక పోవచ్చు. అలా అని కార్లో తిరగాలి అంటే అదనంగా డబ్బులు కట్టాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
