- Telugu News Photo Gallery Those suffering from these problems should not eat cashews, Check Here is Details
Cashew: ఈ సమస్యలతో బాధ పడేవారు జీడిపప్పు తినకపోవడమే మంచిది!
జీడిపప్పు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నట్స్‌లో ఇవి కూడా ఒకటి. చాలా మందికి ఇష్టమైన వాటిల్లో జీడిపప్పు కూడా ఉంటుంది. ఈవెనింగ్ స్నాక్ రూపంలో జీడిపప్పుతో చేసిన ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు మాత్రం జీడిపప్పు తినకపోవడమే మంచిది..
Updated on: Jan 17, 2025 | 2:51 PM

జీడి పప్పును సరిగ్గా వాడుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ లభిస్తాయి. జీడిపప్పులో అనేక పోషకాలు లభిస్తాయి. దీన్ని అనేక రకాలుగా స్నాక్స్‌లో వాడుతూ ఉంటారు. చాలా మందికి జీడిపప్పు అంటే చాలా ఇష్టం. కానీ కొన్ని రకాల సమస్యలతో బాధ పడేవారు మాత్రం జీడిపప్పుకు దూరంగా ఉండటమే మంచిది.

అలర్జీ సమస్యలతో బాధ పడేవారు జీడిపప్పుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ నట్స్ తినే ముందు కూడా ఆలోచించాలి. ఈ జీడిపప్పుల్లో అలర్జీలు పెంచే గుణం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారు ఆలోచించి తీసుకోవడం మేలు.

హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడేవారు కూడా ఈ జీడిపప్పుకు దూరంగా ఉండాలి. జీడిపప్పు తింటే ఈ సమస్య మరింతపెరగొచ్చు. ముఖ్యంగా ఫ్రై చేసిన జీడిపప్పు వీరు అస్సలు తీసుకోకూడదు. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్నవారు కూడా జీడిపప్పుకు దూరంగా ఉండాలి.

ఇతర మూత్ర పిండాల సమస్యలు ఉన్నవారు కూడా జీడిపప్పుకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇందులో ఆక్సలేట్, ఫాస్పరస్ ఉంటుంది. ఇది కిడ్నీలకు అంత మంచిది కాదు. డయాబెటీస్, థైరాయిడ్ ఉన్నవారు కూడా జీడిపప్పు తినకూడదు.

అధిక రక్త పోటు సమస్యతో బాధ పడేవారు సైతం ఈ జీడిపప్పును తినకపోవడమే మంచిది. నెలసరి సమయంలో కూడా మహిళలు ఈ జీడిపప్పుకు దూరంగా ఉంటే బెటర్. అర్థరైటిస్‌తో బాధ పడేవారు కూడా తినకూడదని నిపుణులు అంటున్నారు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




