- Telugu News Photo Gallery These are the strange things that happen in the human body after sleep, check details in Telugu
Sleeping Facts: నిద్ర పోయాక మనిషి శరీరంలో జరిగే వింతలు ఇవే!
మీకు కలలో పెద్ద ఎత్తైన భవనం లేదా ఎత్తు నుంచి పడిపోయినట్లు కల కంటూ ఉంటారు. దీంతో భయంతో కేకలు పెడుతూ ఉంటారు. నిజానికి ఇది కలలో జరిగినా.. బయటకు అరుస్తూ ఉంటారు. చూసి లేస్తే ఏమీ ఉండదు. దీన్ని హిప్నోగోజిక్ జెర్క్ అని అంటారు. కొందరికి ఒకే కల మళ్లీ మల్లీ వస్తుంది. ఏదైనా విషయం గురించి బాగా ఆలోచించినప్పుడు ఈ కలలు అనేవి ఎక్కువగా వస్తాయి. వాటిపై మీ మనస్సును మరల్చుకోలేనప్పుడు మెదడు..
Updated on: Dec 28, 2023 | 6:01 PM

మనిషికి తగినంత విశ్రాంతి అవసరం. ఏ పని చేసినా.. చేయకపోయినా.. సరైన నిద్ర ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. ఒక్క రోజు సరిగ్గా నిద్ర లేకపోయినా.. దాని ఒత్తిడి మనిషి ఆరోగ్యంపై పడుతుంది. దీని వల్ల తల నొప్పి, వికారం, వాంతులు, జీర్ణ సమస్యలు ఇలా చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి. ఈ విషయం అటు ఉంచితే.. నిద్రపోయాక శరీరంలో కొన్ని రకాల వింతలు జరుగుతాయన్న విషయం మీకు తెలుసా?

ఏంటా అని ఆశ్చర్య పోతున్నారా.. చాలా మంది వాటిని అనుభవించే ఉంటారు. కానీ ఇప్పటికీ కొన్ని విషయాలు వింతగానే అనిపిస్తాయి. స్లీమ్ టాకింగ్, స్లీప్ వాకింగ్ లాంటివి జరుగుతూ ఉంటాయి.

మీకు కలలో పెద్ద ఎత్తైన భవనం లేదా ఎత్తు నుంచి పడిపోయినట్లు కల కంటూ ఉంటారు. దీంతో భయంతో కేకలు పెడుతూ ఉంటారు. నిజానికి ఇది కలలో జరిగినా.. బయటకు అరుస్తూ ఉంటారు. చూసి లేస్తే ఏమీ ఉండదు. దీన్ని హిప్నోగోజిక్ జెర్క్ అని అంటారు.

కొందరికి ఒకే కల మళ్లీ మల్లీ వస్తుంది. ఏదైనా విషయం గురించి బాగా ఆలోచించినప్పుడు ఈ కలలు అనేవి ఎక్కువగా వస్తాయి. వాటిపై మీ మనస్సును మరల్చుకోలేనప్పుడు మెదడు ఈ కలలు అనేది కంటుంది.

కొందరు నిద్రలో లేచి మాట్లాడుతూ ఉంటారు. అలాగే మేల్కొని ఉన్నా కూడా ఏవో వింతలు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నిజంగానే మెలకువగా లేరు. కలలో మాత్రమే మేల్కొన్నారని అర్థం. ఇలా నిద్ర పోయే సమయంలో శరీరంలో అనేక వింతలు జరుగుతూ ఉంటాయి. మరిన్ని విషయాలు మళ్లీ తెలుసుకుందాం.




