- Telugu News Photo Gallery Cinema photos Heroines are getting ready to show their strength with lady oriented films while maintaining the commercial tempo
Lady Orient Movies: 2024లో మేము సైతం పోటికి రెడీ.. సోలోగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నా బ్యూటీస్..
2023లో మాస్ హీరోయిజానికి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఈ జోరును ఇలాగే కంటిన్యూ చేస్తూ 2024లో మేము సైతం పోటికి రెడీ అంటున్నారు బ్యూటీస్. స్టార్ హీరోయిన్లంతా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. కమర్షియల్ టెంపోను కంటిన్యూ చేస్తూనే... సోలోగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న బ్యూటీ రష్మిక మందన్న.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Dec 28, 2023 | 5:53 PM

2023లో మాస్ హీరోయిజానికి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఈ జోరును ఇలాగే కంటిన్యూ చేస్తూ 2024లో మేము సైతం పోటికి రెడీ అంటున్నారు బ్యూటీస్. స్టార్ హీరోయిన్లంతా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. కమర్షియల్ టెంపోను కంటిన్యూ చేస్తూనే... సోలోగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా 2024లో సోలో హిట్ మీద కన్నేశారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు జిగేల్ రాణి.

ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న బ్యూటీ రష్మిక మందన్న. బాలీవుడ్ మూవీస్‌తో పాటు సౌత్ మూవీస్‌లోనూ ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ, గ్యాప్‌లో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్‌ఫ్రెండ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ 2024 ఫస్ట్ హాప్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

లేడీ ఓరియంటెడ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్న కీర్తి సురేష్ కూడా 2024లో బిగ్ ప్లాన్‌తో రెడీ అవుతున్నారు. హోంబలే బ్యానర్లో రూపొందుతున్న రఘుతాత సినిమాతో బిగ్ హిట్‌ను టార్గెట్ చేశారు.

బాలీవుడ్‌లోనూ ఈ జోరు గట్టిగా కనిపిస్తోంది. ఉలజ్‌తో జాన్వీ కపూర్, జిగ్రాతో అలియా భట్ మరోసారి లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ రెండు సినిమాలు 2024లోనే ఆడియన్స్ ముందుకు రానున్నాయి.

ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసిన సారా అలీఖాన్ కూడా నెక్ట్స్ ఇయర్ లేడీ ఓరియంటెడ్ జానర్‌లోకి అడుగుపెడుతున్నారు. ఏ వతన్ మేరే వతన్ సినిమాతో సోలోగా సక్సెస్ కొట్టాలని కష్టపడుతున్నారు. మరికొంత మంది బ్యూటీస్ కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాల విషయంలో సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు.





























