February Movies: హెక్టిక్‌గా మారుతున్న ఫిబ్రవరి క్యాలెండర్.. చిన్న సినిమాల హవా..
సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటికి రెడీ అవుతున్నాయి. దీంతో మీడియం రేంజ్ మూవీస్ ఆ తరువాత డేట్స్‌కు షిప్ట్ అవ్వుతున్నాయి. ఇన్నాళ్లు డైలమాలో ఉన్న మేకర్స్ ఒక్కొక్కరుగా కొత్త డేట్స్‌ను ఎనౌన్స్ చేస్తున్నారు. దీంతో ఫిబ్రవరి క్యాలెండర్ కూడా హెక్టిక్‌గా మారుతోంది. ఫిబ్రవరి క్యాలెండర్‌కు పొలిటికల్ మూవీతో వెల్‌కం చెబుతున్నారు దర్శకుడు మహి వి రాఘవ. సిద్దూ జొన్నలగడ్డ ఫిబ్రవరిలో టిల్లు స్క్వేర్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Dec 28, 2023 | 5:19 PM

సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటికి రెడీ అవుతున్నాయి. దీంతో మీడియం రేంజ్ మూవీస్ ఆ తరువాత డేట్స్‌కు షిప్ట్ అవ్వుతున్నాయి. ఇన్నాళ్లు డైలమాలో ఉన్న మేకర్స్ ఒక్కొక్కరుగా కొత్త డేట్స్‌ను ఎనౌన్స్ చేస్తున్నారు. దీంతో ఫిబ్రవరి క్యాలెండర్ కూడా హెక్టిక్‌గా మారుతోంది.

ఫిబ్రవరి క్యాలెండర్‌కు పొలిటికల్ మూవీతో వెల్‌కం చెబుతున్నారు దర్శకుడు మహి వి రాఘవ. యాత్ర సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవా లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలు మమ్ముట్టి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

డీజే టిల్లుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సిద్దూ జొన్నలగడ్డ ఫిబ్రవరిలో టిల్లు స్క్వేర్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో టిల్లు స్క్వేర్ మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.

ఫస్ట్ ఫీక్‌లోనే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు సందీప్ కిషన్. చాలా రోజులుగా సరైన డేట్ కోసం ఎదురుచూస్తున్న ఊరుపేరు భైరవకోన టీమ్ ఫిబ్రవరి 9న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు సందీప్.

ఫిబ్రవరి క్యాలెండర్‌లో మరో ఇంట్రస్టింగ్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. తొలి ఏరియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న వరుణ్ తేజ్ ఈమూవీతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. ఇలా వరుసగా ఇంట్రస్టింగ్ మూవీస్ లైన్‌లో ఉండటంతో ఫిబ్రవరి క్యాలెండర్ హెక్టిక్‌గా కనిపిస్తోంది.





























