Health Tips: జీన్స్‌తో తప్పదు పెను ప్రమాదం.. ఆ సమయంలో అస్సలు ధరించకుడదు..
జీన్స్ ఈ పదం తెలియని వారు ఉండరు. చిన్న పిల్లల మొదలు సీనియర్ సిటిజన్స్ వరకు అందరూ జీన్స్ దుస్తులను వాడుతున్నారు. దీనిని జీన్స్ యుగం అని చెప్పవచ్చు. అయితే ఈ జీన్స్ దుస్తులను ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. నేటి సమాజంలో ఈ దుస్తులను పురుషులకు సమానంగా స్త్రీలు కూడా వాడుతున్నారు. ఈ జీన్స్ దుస్తులు బయటకు వెళ్లేటప్పుడు వాడితే పరవాలేదు. అదే ఇంటికి వచ్చిన తరువాత కూడా అదే జీన్స్ తో నిద్రపోతే లేని సమస్యలు కొనితెచ్చుకున్న వాళ్లవుతారు.