- Telugu News Photo Gallery These are the causes of hormonal imbalance in women, Check here is details in Telugu
Hormonal Imbalance: మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
మహిళల్లో వచ్చే సాధారణ సమస్యల్లో హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ కూడా ఒకటి. ఇవి సాధారణ సమస్యే అయినా.. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. వీటి వల్ల మహిళలు అనేక సమస్యలకు గురవుతూ ఉంటారు. మహిళ వయస్సు, ఆరోగ్య పరిస్థితుల వల్ల. హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, మారిన లైఫ్ స్టైల్ కారణంగా, ఒత్తిడి, మానసిక సమస్యల వల్ల.. ప్రతీ పది మందిలో ఇద్దరు మహిళలు..
Updated on: Apr 20, 2024 | 12:31 PM

మహిళల్లో వచ్చే సాధారణ సమస్యల్లో హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ కూడా ఒకటి. ఇవి సాధారణ సమస్యే అయినా.. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. వీటి వల్ల మహిళలు అనేక సమస్యలకు గురవుతూ ఉంటారు. మహిళ వయస్సు, ఆరోగ్య పరిస్థితుల వల్ల. హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి.

ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, మారిన లైఫ్ స్టైల్ కారణంగా, ఒత్తిడి, మానసిక సమస్యల వల్ల.. ప్రతీ పది మందిలో ఇద్దరు మహిళలు హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్‌కు గురవుతున్నారు. హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ అయితే.. మీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి.

హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ అయితే.. మీకు నెలసరి అనేది సరైన సమయానికి రాదు. అదే విధంగా ఒక్కటే సారి బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతారు. మీకు మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. ఏదో ఆందోళనగా, ఒత్తిడి, డిప్రెషన్ లక్షణాలు కూడా కనిపిస్తాయి.

అంతే కాకుండా ముఖంపై పింపుల్స్, పొడి చర్మం లేదా జిడ్డు చర్మం వంటి చర్మ సమస్యల వల్ల కూడా హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ అయినట్లు చెప్పొచ్చు. అలాగే ఈస్ట్రోజెన్ స్థాయిల్లో మార్పులు వల్ల శరీరంలో వేడి ఆవిర్లు, చెమటలు ఎక్కువగా పట్టడం కూడా జరుగుతుంది.

హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ అవ్వడం నుంచి ఉపశమనం పొందాలి అంటే.. ఆరోగ్యంగా ఉండే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణ ధాన్యాలు వంటివి తీసుకోవాలి. షుగర్ ఉండే ఆహారాలు, కొవ్వు పదార్థాలు తీసుకోకూడదు. వ్యాయామం అనేది ఖచ్చితంగా చేయాలి.




