Diabetes: షుగర్‌తో బాధపడుతున్నారా.? ఈ జ్యూస్‌లు తాగితే ఇట్టే కంట్రోల్‌

డయాబెటిస్‌ వచ్చిందంటే చాలు అంత సులభంగా తగ్గదు. ఒక్కసారి ఈ వ్యాధి వచ్చిందంటే చాలు జీవనశైలి మొత్తం మార్చాల్సిందే. తీసుకునే ఆహారం మొదలు, వ్యాయామం వరకు అన్నింటిలో మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఏవైనా జ్యూసులు తాగాలన్నా భయపడే పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని రకాల జ్యూస్‌లు డయాబెటిస్‌ బాధితులకు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు..

|

Updated on: Sep 05, 2024 | 3:09 PM

షుగర్ పేషెంట్స్‌కి ఉసిరి రసం కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్‌, హైపోగ్లైసీమిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిక్ బాధితులు ప్రతీరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి రసం తీసుకుంటే మార్పు గమనించవచ్చు.

1 / 5
షుగర్ పేషెంట్లకు కాకరకాయ రసం ఎంతో మేలు చేస్తుంది. చేదుగా ఉంటుందని దూరంగా ఉంటే మాత్రం చాలా మిస్‌ అవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. కాకరాయలో విటమిన్ ఎ, విటమిన్ సితో పాటు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ లాగా పనిచేసి, చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

2 / 5
షుగర్ పేషెంట్స్‌కి క్యారెట్ జ్యూస్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చక్కెర స్థాయిని నిర్వహించడంలో సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్‌ని సరైన మోతాదులో తాగడం వల్ల షుగర్ లెవెల్స్‌ అదుపులో ఉంటాయి. అలాగే శరీరానికి మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

3 / 5
పాలకూరను సహజంగా మనం కూర రూపంలో తీసుకుంటాం. అయితే పాలకూర జ్యూస్‌ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. ఇది చక్కెర స్థాయి నియంత్రణలో ఉంచడంలో ఉపయోగపడుతుంది.

4 / 5
సాధారణంగా పుచ్చకాయ అనగానే డయాబెటిస్‌ రోగుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని భావిస్తుంటారు. అయితే పుచ్చకాయ రసంలో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లతో సహా అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి టైప్ 2 డయాబెటిస్‌కు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow us