నెలకు ఎంత వస్తుంది.. ఈ పథకంలో గరిష్ట పరిమితి గతంలో రూ. 15లక్షలుగా ఉండేది. 2023 బడ్జెట్ సమయంలో దీనిని రూ. 30లక్షలకు పెంచింది. మీరు ఒకేసారి రూ. 30లక్షలు పెట్టుబడి పెడితే ఏటా రూ. 2.46లక్షలు వడ్డీనే లభిస్తుంది. ఈ మొత్తాన్ని ప్రతి మూడు నెలలకు ఓసారి రూ. 61,500 చొప్పున మీకు అందిస్తారు.