Super Food : సర్వరోగాలకు ఇదొక్కటే మందు..! ఆరోగ్యంగా,ఎనర్జీగా బరువు తగ్గించే సూపర్ ఫుడ్
రాగులు ఒక ప్రసిద్ధ ముతక ధాన్యం. ఇందులో కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కొన్ని పరిశోధనల ద్వారా ఇది రక్తపోటు, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఎముకలను బలోపేతం చేయడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని పేర్కొన్నాయి. రాగులు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఇది గుండె జబ్బులు, వృద్ధాప్యం, ఆర్థరైటిస్, వాపు, రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
Updated on: Oct 25, 2025 | 4:00 PM

తృణ ధ్యాన్యాల్లో ఒకటైన రాగులు పేదల ఆహారంగా పిలుస్తారు. కానీ, ఇప్పుడు దీన్ని పేదవాళ్లు కాదు, పెద్ద పెద్ద వాళ్లు కూడా ఏరి కోరీ తెచ్చుకుని తింటున్నారు. రాగులను ఫింగర్ మిల్లెట్స్ అని కూడా పిలుస్తారు. రాగులలో కాల్షియం, ఐరన్ తో పాటూ, ప్రోటీన్, భాస్వరం, అధిక ఫైబర్ ఉంటాయి. ఇది శరీరానికి ఆరోగ్యంతో పాటూ మలబద్దకాన్ని నివారిస్తుంది.

రాగుల్లో అధికంగా లభించే ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అతిగా తినకుండా ఆపుతుంది. చాలాసేపటి వరకు కడపు నిండుగా ఉంచుతుంది. ఫిట్నెస్ ప్రియులు, ఉబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

రాగి పిండిలో పుష్కలంగా లభించే మెగ్నీషియం, పొటాషియంలు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. రాగులు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రాగుల్లోని ఫైబర్ మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీంతో పాటు అరుగుదల సమస్యలు, మలబద్ధకం, కడుపుబ్బరం లాంటి ఇతర జీర్ణ రుగ్మతలను నయం చేస్తాయి.

పాల పదార్థాలతో పోలిస్తే రాగులలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవటంలో కాల్షియం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంతేకాదు.. రాగులతో చేసిన ఆహార పదార్థాలు బోలు ఎముకలు లాంటి వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు రాగులు చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు.

రాగులను తరచుగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎందుకంటే రాగుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండి, అసంతృప్త కొవ్వులు తక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి రాగులు బెస్ట్ ఎంపికగా చెబుతున్నారు.




