AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాన్సర్‌ను తరిమికొట్టే అద్భుత పండ్లు.. సీజన్‌తో పనిలేకుండా తింటూ ఉండండి..!

ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మందిని క్యాన్సర్ మహమ్మారి వేధిస్తోంది. దీని బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది మృత్యువాత పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మరణాలకు రెండవ ప్రధాన కారణం క్యాన్సర్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కూడా నివేధిక వెల్లడించింది. అయితే, ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల మరణం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, దీనికి కారణాలు అనేకం ఉన్నాయని అంటున్నారు. కానీ, ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులతో క్యాన్సర్ల నుంచి దూరంగా ఉండొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో భాగంగా కొన్ని రకాల పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటంటే..

Jyothi Gadda
|

Updated on: Jun 29, 2025 | 1:38 PM

Share
ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇది క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. న‌ల్ల ద్రాక్ష‌ల్లో ఫ్లేవ‌నాయిడ్స్‌, రెస్వెరెట్రాల్ అనే స‌మ్మేళ‌నాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్స‌ర్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల న‌ల్ల ద్రాక్ష‌ల‌ను రోజూ తింటుంటే క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకోవ‌చ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. న‌ల్ల ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గుతుంది. ఇది క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాల‌ను త‌గ్గిస్తుంది. న‌ల్ల ద్రాక్ష‌ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గి క్యాన్స‌ర్ రాకుండా ఉంటుంది.

1 / 5
యాపిల్‌లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. యాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా కోలన్ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు..యాపిల్‌ లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీని నేరుగా తినడమే కాకుండా జ్యూస్, జామ్, పైస్, కేక్‌లు తయారు చేసుకోవచ్చు.

2 / 5
Papaya

Papaya

3 / 5
స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ వంటి బెర్రీలు కూడా క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను ఎదురిస్తాయి. ఈ బెర్రీ ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఫైబర్, విటమిన్ సి, మ్యాంగనీజ్ సమృద్ధిగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. వీటిలో కాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ విషయాన్ని అనేక స్టడీస్ వెల్లడించాయి.

4 / 5
ఈ పండులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల, దీన్ని తినడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ప్యాషన్‌ ఫ్రూట్‌లో యాంటీక్యాన్సర్‌ గుణాలు ఉన్నాయి. ఈ పండు తరచుగా తీసుకుంటే.. గ్రాస్ట్రిక్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. దీనిలో విటమిన్‌ ఏ, సీ యాంటీఆక్సిడెంట్ ప్రభావాన్ని ప్రదర్శించి ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించి క్యాన్సర్‌కు వ్యతిరేకంగా రక్షణను అందిస్తుంది.

5 / 5