- Telugu News Photo Gallery Technology photos Zebronics laptop under 30000 this i5 12th generation laptop offer 512gb ssd available on amazon
Laptop Under 30000: రూ.30 వేలలోపు i5 ప్రాసెసర్, 512GB ల్యాప్‌టాప్స్.. అద్భుతమైన ఫీచర్స్
రూ.30 వేల వరకు బడ్జెట్‌లో ఐ5 ప్రాసెసర్ ల్యాప్‌టాప్ పొందడం కష్టమని మీరు కూడా అనుకుంటే, అది పొరపాటే. అది 12వ జనరేషన్ i5 ప్రాసెసర్‌ను అందించడమే కాకుండా అనేక ఇతర గొప్ప ఫీచర్లను కూడా అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర ఎంతో తెలుసుకుందాం?
Updated on: Aug 18, 2024 | 12:58 PM

రూ.30 వేల వరకు బడ్జెట్‌లో ఐ5 ప్రాసెసర్ ల్యాప్‌టాప్ పొందడం కష్టమని మీరు కూడా అనుకుంటే, అది పొరపాటే. అది 12వ జనరేషన్ i5 ప్రాసెసర్‌ను అందించడమే కాకుండా అనేక ఇతర గొప్ప ఫీచర్లను కూడా అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర ఎంతో తెలుసుకుందాం?

బ్యాటరీ బ్యాకప్: రూ.30 వేల కంటే తక్కువ ధర కలిగిన ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. అమెజాన్‌లోని లిస్టింగ్ ప్రకారం, ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 10 గంటల పాటు పనిచేస్తుంది.

కనెక్టివిటీ: ఈ ల్యాప్‌టాప్‌లో టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, 2 USB 3.2 పోర్ట్‌లు, ఒక HDMI పోర్ట్, SD కార్డ్ స్లాట్, USB 2.0 పోర్ట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ వెర్షన్ 5, హెడ్‌ఫోన్ జాక్ ఉంటాయి.

Zebronics ల్యాప్‌టాప్: ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఈ ల్యాప్‌టాప్‌లో 12వ జనరేషన్ i5 ప్రాసెసర్, 512 GB SSD స్టోరేజ్, 15.6 అంగుళాల స్క్రీన్, Dolby Atmos, Windows 11 సపోర్ట్ ఉంది.

Zebronics Pro Series: ఈ ల్యాప్‌టాప్ ధర రూ.29 వేల 990. మీరు ఈ ల్యాప్‌టాప్‌ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు.