Redmi 13 4G: బడ్జెట్‌లో మంచి ఫీచర్ల ఫోన్‌ కోసం చూస్తున్నారా.? ఇదే బెస్ట్‌ ఆప్షన్‌

ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్‌ ఫోన్‌ల హవా నడుస్తోంది. చైనాకు చెందిన దిగ్గజ సంస్థలు తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రెడ్‌మీ 13 పేరుతో తీసుకొస్తున్న ఈ 4జీ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: May 28, 2024 | 11:02 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రెడ్‌మీ 13 పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ను బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని లాంచ్‌ చేస్తోంది. అయితే ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో రెడ్‌మీ కొత్తగా మళ్లీ 4జీ ఫోన్‌ లాంచ్‌ చేయడం గమనార్హం.

1 / 5
ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర వఙషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 16,500గా ఉండగా, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 19వేలుగా ఉండనుంది. ఈ ఫోన్‌ను బ్లాక్‌, బ్లూ, పింక్‌, ఎల్లో షేడ్స్‌తో తీసుకొస్తున్నారు.

2 / 5
రెడ్‌మీ13 స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్ హెలియో జీ91 ఆల్ట్రా ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ తోపాటు రెండు సర్క్యులర్ కెమెరా యూనిట్లను అందించనున్నారు. స్పీకర్ గ్రిల్లె, మిక్, యూఎస్బీ టైప్ సీ చార్జింగ్ పోర్ట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు.

3 / 5
ఇక ఇందులో 6.79 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. 90 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌ ఈ ఫోన్‌ సొంతం. అలాగే ఇందులో  ఎడ్జ్ రైట్ పవర్ అండ్ వాల్యూమ్ బటన్స్‌ను అందించారు. మైక్రో ఎస్టీ కార్డు ద్వారా స్టోరేజీ కెపాసిటీని ఒక టిగా బైట్‌ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

4 / 5
ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడి ప్రైమరీ సెన్సర్‌ కెమరా, 2 మెగాపిక్సెల్స్‌ సెకండరీ కెమెరా, సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఇందులో 33 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5030 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇవ్వనున్నారు.

5 / 5
Follow us