- Telugu News Photo Gallery Technology photos Iqoo launching new smart phone Iqoo neo 9 and Iqoo neo 9 pro
iQOO Neo 9 ఐక్యూ నుంచి మరో స్టన్నింగ్ ఫోన్.. ఫీచర్స్ అదుర్స్ అంతే..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐక్యూ నుంచి కొత్త ఫోన్ లాంచ్ కానుంది. ఐక్యూ నియో 9 సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్స్‌ను లాంచ్ చేయనున్నారు. త్వరలోనే మార్కెట్లోకి ఈ ఫోన్‌లను తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కొన్ని లీక్స్ వైరల్ అవుతున్నాయి..
Updated on: Dec 06, 2023 | 1:44 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐక్యూ.. మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఐక్యూ నియో 9, నియో 9 ప్రో పేరుతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకురానున్నారు. డిసెంబర్ 12వ తేదీన ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది.

నెట్టింట లీక్ అవుతోన్న సమాచారం మేరకు ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన 1.5కే ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 2800x1260 పిక్సెల్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. 144Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.

ఇక ఇందులో ప్రత్యేకంగా 2160Hz PWM డిమ్మింగ్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్ సొంతం. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ డైమెన్షన్ 9300 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు.

ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌లో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీలు అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందిస్తున్నారు.

అయితే ఫ్రంట్ కెమెరాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ ఫోన్ ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో రాబోతున్నట్లు సమాచారం. తొలుత చైనాలో లాంచ్ కానున్న ఈ ఫోన్ త్వరలో భారత్‌లో తీసుకురానున్నారు.





























