CMF Watch Pro 2: సీఎమ్‌ఎఫ్‌ నుంచి స్మార్ట్‌ వాచ్‌.. స్టన్నింగ్ లుక్స్‌తో..

లండన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం నథింగ్‌కు చెందిన సీఎమ్‌ఎఫ్‌ కంపెనీ నుంచి ఇటీవల వరుసగా గ్యాడ్జెట్స్‌ లాంచ్‌ అవుతున్నాయి. మొన్నటికి మొన్న సీఎమ్‌ఎఫ్‌ ఫోన్‌ 1ని లాంచ్‌ చేసిన ఈ సంస్థ తాజాగా స్మార్ట్‌ వాచ్‌ని సైతం తీసుకొచ్చింది. సీఎమ్‌ఎఫ్‌ వాచ్‌ ప్రో 2 పేరుతో ఈ స్మార్ట్‌ వాచ్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Jul 14, 2024 | 7:00 PM

సీఎఫ్‌ఎమ్‌ వాచ్‌ ప్రో 2పేరుతో మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌వాచ్‌ని తీసుకొచ్చింది. ఈ వాచ్‌ను బెజెల్‌ డిసైజ్‌తో ప్రత్యేకంగా తీసుకొచ్చారు. అలాగే ఇందులో 1.32 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ ఆల్‌వేస్‌ ఆన్‌ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 100కిపైగా కస్టమైజ్డ్‌ వాచ్‌ ఫేస్‌లను అందించారు.

1 / 5
ఇక ఈ స్మార్ట్‌ వాచ్‌లో 120కిపై స్పోర్ట్స్‌ మోడ్స్‌ను ఇచ్చారు. 5 స్పోర్ట్స్‌కి ఆటోమెటిక్‌ రికగ్నిషన్‌ ఫీచర్‌ను అందించారు. ఇక హెల్త్‌ ఫీచర్ల విషయానికొస్తే హార్ట్ రేట్ మానిటరింగ్‌తో పాటు బ్లూడు ఆక్సిజన్‌ సాచురేషన్‌ (ఎస్‌పీఓ2), స్ట్రెస్‌ లెవల్‌ వంటి ఫీచర్లను అందించారు.

2 / 5
అలాగే వ్యాచ్‌లో బ్లూటూత్‌ వాయిస్‌ కాల్స్‌ ఆప్షన్‌ను అందించారు. దీంతో ఎంచక్కా వాచ్‌తోనే కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌లోని మ్యూజిక్‌, కెమెరాను వాచ్‌తోనే కంట్రోల్‌ చేసుకోవచ్చు. ఫోన్‌కి వచ్చే నోటిఫికేషన్స్‌ను చూసుకోవచ్చు.

3 / 5
ఇక ఎప్పటికప్పుడు వాతావరణ అప్‌డేట్స్‌ను చూసుకోవచ్చు. ఇక ఈ వాచ్‌ను ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌తో తీసుకొచ్చారు. ఈ వాచ్‌ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 11 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది.

4 / 5
ఈ వాచ్‌ను బ్లాక్‌, ఆరెంజ్‌, లైట్‌ బ్లూ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ధర విషయానికొస్తే మన కరెన్సీలో రూ. 4999గా నిర్ణయించారు. జులై 12 తేదీ నుంచి ఈ వాచ్‌ అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

5 / 5
Follow us