iQoo Neo 9S Pro Plus: కళ్లు చెదిరే ఫీచర్లతో ఐకూ కొత్త ఫోన్‌.. ధర ఎంతో తెలుసా.?

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ ఫోన్‌ల హవా నడుస్తోంది. ఓవైపు బడ్జెట్‌ ఫోన్‌లతో పాటు మిడ్ రేంజ్‌ బడ్జెట్‌ ఫోన్‌లకు సైతం క్రేజ్‌ పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఐకూ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ప్రస్తుతం చైనా మార్కెట్లో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. ఐక్యూ నియో 9ఎస్‌ ప్రో ప్లస్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు..

Narender Vaitla

|

Updated on: Jul 13, 2024 | 10:12 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఐక్యూ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఐకూ నియో 9ఎస్‌ ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 120 వాట్స్‌కు సపోర్ట్‌ చేసే 5500 ఎమ్‌ఏహెచ్‌ వంటి పవర్‌ ఫుల్ బ్యాటరీని అందించారు.

2 / 5
 ధర విషయానికొస్తే 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 34,000కాగా 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 39,000గా నిర్ణయించారు. ఇక 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 42000గా ఉండనుంది. అలాగే 16 జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 46,000గా నిర్ణయించారు.

3 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 144 హెర్ట్జ్ రిఫ్రెష్‌ రేట్‌, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 93.43 శాతంగానూ  ఉంది.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. 5జీ, వైఫై 7, బ్లూటూత్ వీ5.4, యూఎస్‌బీ ఓటీజీ, ఎన్ఎఫ్‌సీ, బైదు, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు.

5 / 5
Follow us