- Telugu News Photo Gallery Technology photos Best water geyser under 3000, check here for full details
Water Geysers: చలికాలం ఈ గ్రీజర్స్‌తో చెక్.. రూ. 3 వేలలోపే..
చలికాలం వచ్చిందంటే స్నానం చేయాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. చల్లటి నీటితో స్నానం చేస్తే చుక్కలు కనిపిస్తాయి. అందుకే వాటర్ గీటర్స్ ఉపయోగిస్తుంటారు. అయితే హీటర్స్‌తో భద్రత ఉండదు. అలా అనీ గ్రీజర్స్ కొనుగోలు చేద్దామంటే ధర ఎక్కువ ఉంటుందని మొగ్గు చూపరు. కానీ తక్కువ ధరలో కూడా గ్రీజర్స్ అందుబాటులో ఉన్నాయి. రూ. 3 వేలలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ గీజర్స్‌పై ఓ లుక్కేయండి..
Updated on: Nov 28, 2023 | 11:11 PM

Bajaj Splendora: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ గ్రీజర్స్‌లో బజాజ్ కంపెనీకి చెందిన గ్రీజర్ ఒకటి. బజాజ్ స్పెండోరా పేరుతో తీసుకొచ్చిన 3 లీటర్ కెపాసిటీ గ్రీజర్ అసలు ధర రూ. 5,890కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 2,899కే సొంతం చేసుకోవచ్చు.

Crompton Gracee: రూ. 3వేలలో అందుబాటులో ఉన్న బెస్ట్ గ్రీజర్స్‌లో ఇదీ ఒకటి. దీని అసలు ధర రూ. 7,299కాగా, 52 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 3,493కే సొంతం చేసుకోవచ్చు. 5 లీటర్స్ కెపాసిటీతో తీసుకొచ్చిన ఈ వాటర్ గ్రీజర్ బరువు 3 కిలోలుపైగా ఉంటుంది.

Crompton Instabliss: ఎలక్ట్రానిన్ ప్రొడక్ట్స్‌కు పెట్టింది పేరైన క్రాంప్టన్‌కు చెందిన ఈ గ్రీజర్ అసలు ధర రూ. 4,400కాగా, 41 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 2,598కే సొంతం చేసుకోవచ్చు. 3000 వాట్స్‌తో పనిచేసే ఈ గ్రీజర్ బరువు 2.4 కిలోలు ఉంటుంది. 2 ఏళ్ల వారంటీ అందిస్తారు.

Orient Aura: ఓరియంట్ అవురా ఇన్‌స్టాంట్ ప్రో గ్రీజర్ అసలు ధర రూ. 5,490కాగా 51 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 2,690కే సొంతం చేసుకోవచ్చు. 3 లీటర్ల కెపాసిటీతో కూడిన ఈ గ్రీజర్‌లో 3000 వాట్స్ హెవీ కాపర్ హీటింగ్ ఎలిమెంట్‌ను అందించారు. ఈ గ్రీజర్ బరువు 2.8 కిలోలు ఉంటుంది.

V-Guard Zio Instant Water Geyser: వీగార్డ్ కంపెనీకి చెందిన ఈ గ్రీజర్ అసలు ధర రూ. 4,700కాగా, 38 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 2,899కే సొంతం చేసుకోవచ్చు. 3 లీటర్స్ కెపాసిటీతో తీసుకొచ్చిన ఈ వాటర్ గ్రీజర్ 3 కిలోవాట్స్ పవర్‌తో పనిచేస్తుంది.





























