- Telugu News Photo Gallery Technology photos Oneplus launching new smart phone on december 4th Oneplus 12 features and price details
OnePlus 12: వన్‌ప్లస్ 12 లాంచింగ్ అప్పుడే.. ఫీచర్స్ ఎలా ఉండనున్నాయంటే..
బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లకు పెట్టింది పేరు వన్‌ప్లస్. మొదట్లో కేవలం ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ప్రొడక్ట్స్‌ను తీసుకొచ్చిన వన్‌ప్లస్ తాజాగా బడ్జెట్ ఫోన్‌లను సైతం లాంచ్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. వన్‌ప్లస్ 12 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఇంతకీ వన్‌ప్లస్ 12 ఎప్పుడు అందుబాటులోకి రానుంది.? ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Nov 28, 2023 | 10:19 PM

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ తాజాగా కొత్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ప్రీమియం సెగ్‌మెంట్‌లో భాగంగా ఈ ఫోన్‌ను తీసుకురానున్నరు. వన్‌ప్లస్ 12 పేరుతో లాంచ్ చేయనున్నారు. డిసెంబర్ 4వ తేదీన ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్నండగా, వచ్చే ఏడాది జనవరిలో గ్లోబల్ లాంచ్ కానుంది.

అయితే భారత్‌లో ఈ ఫోన్‌లు మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక వన్‌ప్లస్ 12 లాంచింగ్ కంటే ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇక ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించనున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ పని చేయనుంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. ఇందులో 64 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాలు ఇవ్వనున్నారు. ఇక సెల్ఫీ విషయానికొస్తే ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 5400 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో పెరిస్కోప్ జూమ్ లెన్స్‌ను అందించారు. దీంతో దూరంలో ఉన్న సబ్జెక్ట్స్‌ను కూడా హై క్వాలిటీ ఫొటోలను తీసుకోవచ్చు. ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా కర్వ్డ్ డిస్‌ప్లేను అందించారు.




