- Telugu News Photo Gallery Tech Tips: Here is the tricks to know if someone reading Your WhatsApp messages secretly
Tech Tips: మీ వాట్సాప్ మెసేజ్‌లను మీకు తెలియకుండా ఎవరైనా చదివితే తెలుసుకోవడం ఎలా?
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ అప్లికేషన్ తన వినియోగదారులకు అనేక ఫీచర్లను పరిచయం చేయడం ద్వారా ఇప్పటికే ప్రజాదరణ పొందింది. మరిన్ని అప్‌డేట్‌లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి..
Updated on: Jul 18, 2023 | 6:25 PM

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ అప్లికేషన్ తన వినియోగదారులకు అనేక ఫీచర్లను పరిచయం చేయడం ద్వారా ఇప్పటికే ప్రజాదరణ పొందింది. మరిన్ని అప్‌డేట్‌లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే యూజర్ అకౌంట్ సెక్యూరిటీ కోసం కొన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ కొన్నిసార్లు వాట్సాప్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా సార్లు యూజర్ల వాట్సాప్ చాట్‌పై వేరొకరు వారికి తెలియకుండానే గూఢచర్యం చేసే అవకాశాలు ఉన్నాయి.

వాట్సాప్ ఖాతాను ఇతర పరికరాలలో ఉపయోగించవచ్చు. కొన్నిసార్లు సమస్య కావచ్చు. కంప్యూటర్లలో వాట్సాప్ వాడే వారి సంఖ్య కూడా పెరిగింది. అందుకే మన ఖాతా ఎక్కడ లాగిన్ అయిందో మాకు తెలియదు. అందుకే మీ వాట్సాప్‌ను మరెవరైనా చూస్తున్నారో లేదో తెలుసుకోవడం ఎలా?

కొన్నిసార్లు యూజర్ పొరపాటు వల్ల ఇతరులు వాట్సాప్ చాట్/మీడియా ఫైల్‌లను చూస్తుంటారు. అంటే యూజర్ల పొరపాటు వల్ల వాట్సాప్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

హ్యాక్ చేయబడిన వాట్సాప్ కొన్నిసార్లు దుర్వినియోగం కావచ్చు. ఎవరైనా యూజర్ వాట్సాప్ చాట్‌ను రహస్యంగా చదువుతున్నారా? చూస్తున్నారా? అనేది తెలుసుకోవడం ముఖ్యం.

ఎవరైనా యూజర్ WhatsApp చాట్‌ని రహస్యంగా చదువుతున్నారో.. క్షిస్తున్నారో తెలుసుకోవడానికి థర్డ్ పార్టీ యాప్ అవసరం లేదు. బదులుగా వినియోగదారులు తమ వాట్సాప్ లోనే ఈ సమాచారాన్ని పొందవచ్చు.

ముందుగా మీ వాట్సాప్ అప్లికేషన్‌ని ఓపెన్ చేయండి. అప్పుడు కుడి వైపున కనిపించే మూడు చుక్కలను ఎంచుకోండి. తర్వాత అక్కడ కనిపించే వాట్సాప్ వెబ్/ లింక్ డివైస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీరు మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో వాట్సాప్‌ని తెరవకపోయినా.. అది లింక్‌ను చూపుతున్నట్లయితే మీ వాట్సాప్ చాట్‌ను ఎవరో చదువుతున్నారని అర్థం.




