- Telugu News Photo Gallery Political photos NDA Meeting held with 38 parties in presence of PM Modi see photos
NDA Meeting: ఢిల్లీలో ప్రారంభమైన ఎన్డీఏ సమావేశాలు.. హాజరైన 38 పార్టీల నేతలు..
NDA Meeting: న్యూఢిల్లీలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో 38 పార్టీలు పాల్గొంటున్నాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.
Updated on: Jul 18, 2023 | 7:20 PM

ఢిల్లీలోని అశోక్ హోటల్‌లో మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో ఎన్డీఏ పార్టీల సమావేశం ప్రారంభమైంది

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోటో సెషన్‌లో మోదీ వెనుక నిలబడి ఉన్నారు. ఫోటో దిగిన అనంతరం మోడీ పవన్ కళ్యాణ్‌ను ఆప్యాయంగా పలకరించారు. ఆయనకు చిరునవ్వుతో నమస్కరించారు పవన్.

అనంతరం ఆయా పార్టీల నేతలంతా మోదీకి భారీ పూలమాల వేసి సన్మానించారు. అక్కడి నుంచి నేరుగా సమావేశ మందిరానికి వెళ్లారు.

ఇందులో బీజేపీ మిత్రపక్షాలన్నీ తరలివచ్చాయి. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా మొత్తం 38 పార్టీలకు ఆహ్వానం అందింది.

చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జన్‌శక్తి పార్టీ ఎన్డీయే కూటమిలో చేరింది. ఈ సమావేశాలకు హాజరైన చిరాగ్ పాశ్వాన్‌ను ప్రధాని మోదీ ఆప్యాయంగా కౌగిలించుకోవడం ప్రారంభ సమావేశాల్లో ప్రత్యేకంగా నిలిచింది.

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేను ప్రధాని మోదీ ప్రత్యేక పలకరించారు.

ఎన్డీయేను దేశాభివృద్ధి కోసం కూటమిగా అభివర్ణించారు ప్రధాని మోదీ. ఈ కూటమి అన్ని ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఏన్డీఏ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశానికి హాజరైన వారిలో శివసేనకు చెందిన ఏక్ నాథ్ షిండే, లోక్ జనశక్తి పార్టీకి చెందిన చిరాగ్ పాశ్వాన్, జనసేనకు చెందిన పవన్ కళ్యాణ్, అన్నాడీఎంకేకు చెందిన పళనిస్వామి, ఇతర ప్రముఖ నాయకులు ఉన్నారు.




