లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, కె ఉన్నాయి. మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది మరియు ఎముకలు గట్టి పడటానికి ఉపయోగపడుతుంది. లవంగాలలో యాంటీమైక్రోబియల్ లక్షణాలు తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగం నూనె చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ బాగా పనిచేస్తుంది.