Sun Bath: శీతాకాలంలో ఇలా కాసేపు సన్‌బాత్ చేయండి.. ఎన్ని లాభాలో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
వేసవిలో సూర్యరశ్మి తీవ్రంగా చిరాకుపెట్టిస్తుంది. అదే, శీతాకాలంలో సూర్యరశ్మిని అందరూ ఇష్టపడుతుంటారు. చలితో వణికిపోతున్న వేళ..వెచ్చదనం కోసం ఎండలో కూర్చోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వణికించే చలిలో కాసేపు ఎండలో కూర్చుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇది చలినుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లు, దుస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతోపాటు సూర్యరశ్మిని ఆస్వాదించడం కూడా చేయాలి. ఉదయం కొంత సమయం శరీరానికి ఎండ తగిలేలా ఉండటాన్ని సన్‌బాత్ అంటారు. ప్రతిరోజూ కనీసం 15 నిమిషాల పాటు సూర్యరశ్మి శరీరానికి తగిలితే ప్రయోజనం ఉంటుంది. చలికాలంలో సన్‌బాత్ అనేది ఎంతో మేలు చేస్తుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




