- Telugu News Photo Gallery Success story: teenager Esha Singh winning four Asian Games medals is not a surprise
Esha Singh: స్టార్ ప్లేయర్లకే చుక్కలు చూపిస్తున్న హైదరాబాదీ రైఫిల్ షూటర్ ఇషా సింగ్.. ఒలింపిక్స్ లక్ష్యంగా..
ఇషా సింగ్. ఇండియన్ రైఫిల్ షూటింగ్ లో తనో సంచలనం. పార్టిసిపేట్ చేసింది కొన్ని ఈవెంట్స్ లోనేనైనా.. సాధించిన మెడల్స్ మాత్రం 70కి పైనే. బరిలోకి దిగిన ప్రతీ ఈవెంట్ లో మెడల్ సాధిస్తూ… తన రికార్డ్స్ ని తానే బద్దలు కొడ్తోంది. పెట్టుకున్న టార్గెట్ 2024 ఒలంపిక్స్. అందుకోసం కఠోర సాధన చేస్తోంది. ఇక ఏసియన్ గేమ్స్ ఒక గోల్డ్, మూడు సిల్వర్ మెడల్స్ సాధించిన ఈ హైదరబాదీ షూటర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
Updated on: Oct 09, 2023 | 10:11 AM

ఎప్పుడొచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా.. ఈ డైలాగ్ హైదరబాద్ షూటర్ ఇషా సింగ్ కు కరెక్ట్ గా సెట్ అవ్వుద్ది. రైఫిల్ షూటింగ్ లోకి ఎంటరైన కొద్దరోజుల్లోనే.. 10 మీటర్ల ఏయిర్ పిస్టల్ విభాగంలో స్టార్ ప్లేయర్లకే చుక్కలు చూపిస్తోంది ఇషా సింగ్. వచ్చే ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు అర్హత సాధించడమే లక్ష్యంగా చెమటోడుస్తోంది.

ఇండియన్ స్టార్ ప్లేయర్లు హీనా సిద్ధు, మను భాకర్ లకు ధీటుగా రాణిస్తూ.. తక్కువ టైమ్ లోనే తానెంటో నిరూపించుకుంటున్న ఇషా సింగ్ అనుకోకుండా షూటర్ గా మారింది. తన తండ్రి సచిన్ సింగ్ తో సరదాగా షూటింగ్ రేంజ్ కి వెళ్లిన ఇషా.. అక్కడే 10 మీటర్ల ఏయిర్ పిస్టోల్ ని ఫస్ట్ టైమ్ పట్టుకుంది. అప్పట్నుంచి షూటింగ్ చేస్తానంటూ ఇషా మారాం చేయడంతో.. పుణేలోని గగన్ నారాంగ్ అకాడెమీలో జాయిన్ చేశాడు ఇషా తండ్రి. అకాడెమీలో త్రీ-లెవల్ ట్రైనింగ్ ని పూర్తి చేసుకున్న ఇషా సింగ్.. ఆ తర్వాత ఔరంగాబాద్ కి చెందిన సుందర్ ఘాటె దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకుంది.

మారేడ్ పల్లిలో ఉండే తమకు సెంట్రల్ యూనివర్సిటీలోని శాట్స్ షూటింగ్ రేంజ్ దూరమవ్వడం.. రేంజ్ కి ఇషా ను తీసుకెళ్లే వారు లేకపోవడంతో, స్నేహితులు, కొంతమంది స్పాన్సర్ల ఆర్థిక సహాయంతో ఇంట్లోనే లక్షల రూపాలతో 10 మీటర్ల రేంజ్ ని ఏర్పాటు చేశాడు సచిన్ సింగ్. అప్పట్నుంచి ఇంట్లోనే ప్రాక్టీస్ ప్రారంభించింది ఈ లిటిల్ షూటర్. ఇక ఇషా సింగ్ పాల్గొన్న ఫస్ట్ కాంపిటీషన్.. 2015లో శాట్స్ షూటింగ్ రేంజ్ వేదికైన తెలంగాణ స్టేట్ షూటింగ్ ఛాంపియన్షిప్. పాల్గొన్న ఫస్ట్ ఈవెంట్ లోనే 321 పాయింట్లు సాధించి గోల్డ్ మెడల్ సాధించింది.

అనంతరం అదే ఏడాది పూణే, న్యూడిల్లీల్లో జరిగిన గన్ ఫర్ గ్లోరీ 2015, ఆల్ ఇండియ ఇంటర్ స్కూల్ నేషనల్ కాంపిటీషన్స్, నేషనల్ షూటింగ్ కాంపిటీషన్స్ లో మెడల్స్ సాధించింది. 2016 లో జరిగిన రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్షిప్ 10 మీటర్ల ఏయిర్ పిస్టల్ లో యూత్, జూనియర్, సీనియర్ మూడు విభాగాల్లోను గోల్డ్ మెడల్స్ సాధించి... గోల్డెన్ గాళ్ గా పేరు తెచ్చుకుంది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని శాట్స్ షూటింగ్ రేంజ్ వేదికగా 2017లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఐదు మెడల్స్ సాధించింది. యూత్, జూనియర్, సీనియర్, మిక్స్ డ్, టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు గెలిచి జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు రెడీ అయింది. 2018లో కేరళలోని త్రివేండ్రంలో జరిగిన 62వ నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో ఏకంగా ఏడు పతకాలను సొంతం చేసుకోని టాప్ షూటర్లకి షాకిచ్చింది. ఇషా బుల్లెట్ల ధాటికి మను భాకర్, హీనా సిధ్దు, శ్వేతా సింగ్, అంజలీ సహా భారత అగ్రశ్రేణి షూటర్లందరూ చేతులెత్తేశారు. మూడేళ్ల కిందటి వరకు ఇషా అంటే ఎవరికి తెలియని పేరు కాస్తా.. ఈ పోటీలతో జాతీయ స్థాయిలో మార్మ్రోగిపోయింది. పదమూడేళ్ల వయస్సులోనే జాతీయ ఛాంపియన్ గా అవతరించి సరికొత్త రికార్డ్ నెలకొలకొల్పింది. ఇషా సాధిస్తున్న మెడల్స్ ని చూసి ఆస్ట్రియాకి చెందిన వెపన్ మ్యానుఫాక్షర్ కంపెనీ స్టేయిర్.. తనకి వెపన్ ని స్పాన్సర్ చేసింది. దీంతోపాటు తమ కంపెనీకీ ఇషాని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.

జాతీయ స్థాయి పోటీల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఇషా సింగ్.. 2024 ఒలంపిక్స్ టార్గెట్ గా అంతర్జాతీయ టోర్నీల్లోకి ప్రవేశించింది. 2019 తైవాన్ లో జరిగిన 12వ ఆసియా ఏయిర్ గన్ ఛాంపిన్షిప్ లో 10 మీటర్ల ఏయర్ పిస్టల్ లో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్, మిక్స్ డ్ ఈవెంట్ లో బ్రౌంజ్ మెడల్ సాధించి చిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ షూటర్ గా ఈషా న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే ఏడాది తైవాన్ లో జరిగిన ఇంటర్నేషనల్ 10 మీటర్ల మిక్స్ డ్ ఈవెంట్ లో సిల్వర్ మెడల్ సాధించింది. జులైలో న్యూడిల్లీలో జరిగిన నేషనల్స్ లోను రెండ్ గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ పోటీల్లో వ్యక్తిగతంగా 250 పాయింట్లు సాధించి మను భాకర్ రికార్డ్ ను సమం చేసింది. అంతేకాకుండా జాతీయ జూనియర్ ర్యాంకింగ్స్ లో 4 నుంచి రెండో స్థానానికి, జాతీయ సీనియర్ ర్యాంకింగ్స్ లో ఆరు నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది.

దీంతోపాటు జర్మనీలో జరిగిన జూనియర్ వరల్డ్ కప్ లో 10 మీటర్ల ఏయిర్ పిస్టోల్ ఈవెంట్ లో సిల్వల్, 10 మీటర్ల ఏయిర్ పిస్తోల్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో బ్రౌంజ్ మెడల్ సాధించింది. కోవిడ్ వల్ల 2020లో పెద్దగా ఏ స్పోర్ట్స్ ఈవెంట్ ఏమీ జరగక పోయిన ఇంట్లోనే ప్రాక్టీస్ చేసింది. ఇక ఇటీవల పెరూలోని లిమా సిటీ ఆతిథ్యమిచ్చిన ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్న ఇషా.... రెండు సిల్వర్ మెడల్స్ సాధించింది. వ్యక్తిగత విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్, 50 మీటర్ల ప్రీ-పిస్తోల్ విభాగంలో సిల్వర్ మెడల్స్ సాదించింది మన తెలంగాణ అమ్మాయే కావడం విశేషం.

ఇక 2015 నుంచి ఇప్పటి వరకు 15కి పైగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న ఇషా సింగ్.. 60 కి పైగా గోల్డ్, సిల్వర్, బ్రౌంజ్ మెడల్స్ సాధించింది. ఇటీవల చైనాలో జరిగిన ఏసియన్ గేమ్స్ లో 25 మీటర్ల టీమ్ ఈవెంట్ లో గోల్డ్, 25 మీటర్ల ఇండివిజ్యువల్ ఈవెంట్ లో ఒక సిల్వర్ తో పాటు 10 మీటర్ల టీమ్, ఇండివిజ్వల్ ఈవెంట్లలో రెండు సిల్వర్ మెడల్స్ సాధించింది. త్వరలో కొరియాలో జరిగే ఏసియన్ ఛాంపియన్షిప్ తో పాటు... 2024 ఒలంపిక్స్ కి అర్హత సాధించి, మెడల్ సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది.
