- Telugu News Photo Gallery Technology photos Best 5G smartphone under 15k iqoo z6 lite 5g features and price details
iqoo z6 lite 5g: రూ. 13వేలలో 5జీ స్మార్ట్ ఫోన్.. అమెజాన్‌లో సేల్ అమేజింగ్ ఆఫర్
ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ నడుస్తోంది. అక్టోబర్ 8వ తేదీన మొదలైన ఈ సేల్ భాగంగా స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. మరి ఈ సేల్‌లో భాగంగా మీరు కూడా 5జీ ఫోన్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా.? మీ బడ్జెట్ రూ. 13 వేల లోపా..? అయితే ఇది మీకు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. చైనాకు చెందిన ఐక్యూ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి..
Updated on: Oct 12, 2023 | 4:13 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐక్యూ భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా ఐక్యూ జెడ్6 లైట్ 5జీ ఫోన్‌పై 35 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది.

ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 19,999కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 12,999కే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనం 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.

ప్రపంచంలో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఇక ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో ఇచ్చారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. ఐ ఆటోఫోకస్ అనే స్పెషల్ ఫీచర్‌ను ఇందులో అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో లిథియం బ్యాటరీని అందించారు. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 1 టీబీ వరకు మెమోరీని పెంచుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సర్, డ్యూయల్ సిమ్ అందించారు. సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.





























